నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు
* సెన్సెక్స్ 5వందల పాయింట్ల మేర నష్టం * 14,250 దిగువకు చేరుకున్న నిఫ్టీ * 530. 95 పాయింట్ల నష్టంతో ముగిసిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు హైట్రిక్ నష్టాలను అనుభవించాయి. వరుసగా మూడు రోజూ కూడా ఒడుదొడుకలను ఎదుర్కొక తప్పలేదు. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లకు భారీ దెబ్బపడింది. దీంతో సెన్సెక్స్ 5వందల పాయింట్ల మేర నష్టపోగా నిఫ్టీ14,250 దిగువకు చేరుకుంది. ఇక ఉదయం భారీ లాభాలతో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సెన్సెక్స్ కాసేపటి తర్వాత నష్టాల బాట పట్టింది. ఇక మధ్యాహ్నం తర్వాత భారీ నష్టాల్లోకి జారుకుంది. చివరకు 530. 95 పాయింట్ల నష్టంతో 48,347.59 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 133 నష్టంతో 14,238.90 వద్ద సెటిలైంది. దీంతో డాలరుతో రూపాయి మారకం విలువ 72.94గా ఉంది. అయితే బడ్జెట్ సమావేశాల వరకు ఈ నష్టాలు తప్పవని విశ్లేషకులు భావిస్తున్నారు.