దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలు
* అమ్మకాల ఒత్తిడితో బలహీన ధోరణిన సూచీలు * ఫార్మా,మెటల్స్, బ్యాంకింగ్ రంగాల షేర్లలో అమ్మకాలు * సెన్సెక్స్ ఏకంగా 580 పాయింట్లకు పైగా పతనం
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. అమ్మకాల ఒత్తిడితో బలహీనంగా ప్రారంభమైన సూచీలు అంతకంతకూ నష్టాల్లో కూరుకుపోతున్నాయి.ఫార్మా, మెటల్స్, బ్యాంకింగ్ రంగాల షేర్లలో వెల్లువెత్తిన అమ్మకాలు మార్కెట్లను భారీ నష్టాల దిశగా నడిపిస్తున్నాయి. మిడ్ సెషన్ సమయానికి సెన్సెక్స్ 586 పాయింట్లు దిగజారి 47,761 వద్ద, నిఫ్టీ 161 పాయింట్ల నష్టంతో 14,077 వద్ద కదలాడుతున్నాయి.