దేశీయ ఈక్విటీ మార్కెట్లు ర్యాలీ కొనసాగించాయి..వీకెండ్ సెషన్ లో దేశీ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను అందించాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 552 పాయింట్లు పుంజుకుని 41,893 వద్దకు చేరగా.. నిఫ్టీ 143 పాయింట్లు బలపడి 12,263 వద్ద స్థిరపడింది. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ యథాతథ పాలసీ అమలు, డెమొక్రాట్ అభ్యర్థి జోబిడెన్ విజయంపై అంచనాలతో యూఎస్ మార్కెట్లు పుంజుకోగా...ఏషియా మార్కెట్లు మూడేళ్ల గరిష్టాన్ని నమోదు చేశాయి...గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాలను అందిపుచ్చుకున్న భారత ఈక్విటీ మార్కెట్లు లాభాల బాటన పరుగులు తీశాయి....