Stock Market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
Stock Market: సెన్సెక్స్ 482, నిఫ్టీ 127 పాయింట్ లాభం
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో సూచీలు రాణించాయి. ముఖ్యంగా బ్యాంక్ స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతు సూచీలకు కలిసొచ్చింది. 71,072 లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్.. కాసేపటికి నష్టాల్లోకి జారుకుంది. వెంటనే కోలుకుని.. ఆపై రోజంతా లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 70,924- 71,662 మధ్య కదలాడిన సూచీ.. చివరికి 482 పాయింట్ల లాభంతో 71,555 వద్ద ముగిసింది. నిఫ్టీ 127 పాయింట్ల లాభంతో 21,743.25 వద్ద స్థిరపడింది.