Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
Stock Market: సెన్సెక్స్ 5, నిఫ్టీ 9పాయింట్ల నష్టం
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్ 66,084 వద్ద లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 66,235 దగ్గర గరిష్టాన్ని, 65,980 వద్ద కనిష్టాన్ని నమోదు చేసింది. చివరకు 5 పాయింట్లు నష్టపోయి 66,017 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 19,828 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 19,875నుండి 19,786 మధ్య కదలాడింది. చివరకు 9 పాయింట్లు కుంగి 19,802 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.34 వద్ద నిలిచింది.