Stock Market: స్వల్ప లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
Stock Market: నష్టాల్లో ముగిసిన అదానీ ఎంటర్ ప్రైజెస్, రిలయన్స్, టాటా మోటార్స్ షేర్లు
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 87 పాయింట్లు లాభపడి 66వేల988కి చేరుకుంది. నిఫ్టీ 37 పాయింట్లు పెరిగి 20వేల133 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లు ఒడిదుడుకులకు గురయ్యాయి. ఎయిర్ టెల్, సన్ ఫార్మా, హీరో మోటార్స్, విప్రో, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌సీఎల్ టెక్ కంపెనీల షేర్లు లాభాల బాటపట్టాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్, రిలయన్స్, టాటా మోటార్స్, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్ కంపెనీల షేర్లు నష్టాల్లోకి చేరాయి.