దేశీయ స్టాక్‌మార్కెట్లు మరోమారు నష్టాల బాట

* తొలి సెషన్‌లో భారీ లాభాల్లో దూసుకుపోయిన సూచీలు * మలి సెషన్ లో నష్టాలను మిగిల్చిన దేశీ మార్కెట్లు

Update: 2021-02-17 04:29 GMT

Representational Image

దేశీయ స్టాక్‌మార్కెట్లు మరోమారు నష్టాల బాట పట్టాయి. తాజావారం తొలి సెషన్ లో భారీ లాభాల్లో దూసుకుపోయిన సూచీలు మలి సెషన్‌లో నష్టాలను మిగిల్చాయి. ఇక మూడో సెషన్‌లోనూ గ్లోబల్ మార్కెట్ల మిశ్రమ సంకేతాల నేపధ్యంలో ప్రతికూల ధోరణిన సూచీలు కొనసాగుతున్నాయి. ఆరంభ ట్రేడింగ్‌లో బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 157 పాయింట్ల మేర కోల్పోయి 51వేల 946 వద్దకు చేరగా నిఫ్టీ సైతం 43 పాయింట్ల మేర క్షీణించి 15వేల 270 వద్ద కదలాడుతున్నాయి.

Tags:    

Similar News