Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
7.65 పాయింట్ల నష్టంతో ముగిసిన ఇంట్రాడే
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. నిన్నటి భారీ లాభాలతో సరికొత్త రికార్డులను నమోదు చేసిన సూచీలు.. శుక్రవారం కూడా ఇంట్రాడేలో సరికొత్త గరిష్ఠాలను అందుకున్నాయి. సెన్సెక్స్ 75 వేల 636 పాయింట్ల వద్ద ఆల్‌టైమ్ గరిష్ఠాలను తాకగా.. నిఫ్టీ తొలిసారి 23 వేలు దాటింది. ఆపై సూచీలు దిగువకు చేరాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలూ ఇందుకు కారణమయ్యాయి. ఇంట్రాడేలో 7.65 పాయింట్ల నష్టంతో 75 వేల 410 పాయింట్ల వద్ద ముగిసింది. నిప్టీ 10.55 పాయింట్లు కోల్పోయి 22 వేల 957 వద్ద స్థిరపడింది.