Stock Market: సరికొత్త గరిష్ఠాల వద్ద ముగిసిన దేశీయ సూచాలు
Stock Market: సెన్సెక్స్ 126, నిఫ్టీ 59.75 పాయింట్ల లాభం
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సరికొత్త గరిష్ఠాల వద్ద ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో సూచీలూ రాణించాయి. ముఖ్యంగా HDFC బ్యాంక్, రిలయన్స్ షేర్లు సూచీలను ముందుకు నడిపించాయి. దీంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 82 వేల 129 పాయింట్ల వద్ద, నిఫ్టీ 25 వేల 78 వద్ద జీవనకాల గరిష్ఠాలను తాకాయి. గరిష్ఠాల వద్ద అమ్మకాలతో సెన్సెక్స్ 82 వేల దిగువకు చేరగా... నిఫ్టీ మాత్రం తొలిసారి 25 వేల ఎగువన ముగిసింది. సెప్టెంబర్‌లో వడ్డీ రేట్లు తగ్గింపు ఉంటుందని అమెరికా ఫెడ్ చీఫ్ జెరోమ్ పావెల్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ మార్కెట్లలో జోష్‌కు కారణమయ్యాయి. సెన్సెక్స్ 126 పాయింట్లు లాభపడి 81 వేల 867 వద్ద ముగిసింది. నిఫ్టీ 59.75 పాయింట్లు లాభపడి 25 వేల 10 పాయింట్ల వద్ద ముగిసింది.