దేశీ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్‌ ..

దేశీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి...గ్లోబల్ మార్కెట్లు డీలాపడిన నేపధ్యంలో దేశీయంగానూ ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెరతీయడంతో దేశీ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్‌ పడింది..

Update: 2020-10-22 11:07 GMT

దేశీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి...గ్లోబల్ మార్కెట్లు డీలాపడిన నేపధ్యంలో దేశీయంగానూ ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెరతీయడంతో దేశీ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్‌ పడింది..ఆరంభ ట్రేడింగ్ లోనే సెన్సెక్స్‌ 96 పాయింట్లు, నిఫ్టీ 32 పాయింట్ల మేర నష్టాలను నమోదు చేశాయి....చివరకు మార్కెట్ ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 148 పాయింట్ల నష్టంతో 40,558 వద్ద, నిఫ్టీ 41 పాయింట్లు కోల్పోయి 11,896 వద్ద స్థిరపడ్డాయి.

మరోవైపు పండగ సమయాన విలువైన లోహాల ధరలు స్వల్పంగా దిగివచ్చాయి. దేశీ విపణి మల్టీ కమోడిటీ ఎక్సేంజీ లో పదిగ్రాముల బంగారం స్వల్పంగా తగ్గి 51,114 రూపాయల వద్దకు చేరింది. హైదరాబాద్ స్పాట్ మార్కెట్ లో పసిడి ధర 52,920 రూపాయలుగా నమోదయింది..ఇక దేశంలోని మెట్రో నగరాల్లో ఇంధన ధరలు గత 20 రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 84 రూపాయల 25 పైసలు వద్దకు చేరగా.. డీజిల్ ధర లీటర్‌కు 76 రూపాయల 84 పైసలుగా నమోదయింది.

Tags:    

Similar News