దేశీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాల ముగింపు..

* సెన్సెక్స్ 694 పాయింట్ల మేర క్షీణించి 43,828 వద్ద క్లోజ్.. * నిఫ్టీ 196 పాయింట్లు కోల్పోయి 12,858 వద్ద స్థిరం.. * కొద్ది రోజులుగా రికార్డుల ర్యాలీ బాటన స్టాక్‌ మార్కెట్లు .. * ఆరంభ ట్రేడింగ్ లో సెన్సెక్స్ డబుల్ సెంచరీ లాభాలు.. * మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపడంతో తప్పని నష్టాలు...

Update: 2020-11-25 10:43 GMT

దేశీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 694 పాయింట్ల మేర క్షీణించి 43,828 వద్దకు చేరగా. నిఫ్టీ 196 పాయింట్లు కోల్పోయి 12,858 వద్ద స్థిరపడ్డాయి. కొద్ది రోజులుగా రికార్డుల ర్యాలీగా సాగుతున్న దేశీ స్టాక్‌ మార్కెట్లు మిడ్‌సెషన్‌ సమయానికి నష్టాల బాట పట్టాయి. ఆరంభ ట్రేడింగ్ లో సెన్సెక్స్ డబుల్ సెంచరీ లాభాలతో 278 పాయింట్ల వద్దకు చేరగా. నిఫ్టీ 13 వేల ఎగువన 13,150 వద్దకు చేరింది. అయితే మిడ్ సెషన్ సమయానికి మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపడంతో దేశీ సూచీలు నష్టాలను మూటగట్టాయి.

Tags:    

Similar News