దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల బాట

* తాజా సెషన్ లో సూచీలు ఫ్లాట్ గా ప్రారంభం * సెన్సెక్స్ 18.30 పాయింట్ల మేర ఎగసిన వైనం * నిఫ్టీ 2.10 పాయింట్ల స్వల్ప లాభంతో ట్రేడింగ్ * అమ్మకాల వెల్లువతో గురువారం లాభాలబాట * గ్లోబల్ మార్కెట్ల మిశ్రమ సంకేతాల నేపధ్యం

Update: 2020-11-27 04:35 GMT

దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. తాజా సెషన్ లో బెంచ్ మార్క్ సూచీలు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 43 వేల 241 వద్దకు చేరగా... నిఫ్టీ స్వల్ప లాభంతో 12 వేల 984 వద్ద ట్రేడింగ్ ఆరంభించింది. అమ్మకాల వెల్లువతో గురువారం లాభాలను చవిచూసిన మార్కెట్‌.. వారాంతాన ఫ్లాట్‌గా మొదలైంది. గ్లోబల్ మార్కెట్ల మిశ్రమ సంకేతాల నేపధ్యంలో దేశీ సూచీలు అక్కడక్కడే ప్రారంభం కాగా.. తాజా సెషన్ లో ఆటుపోట్లు తప్పకపోవచ్చని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 

Tags:    

Similar News