తక్కువ వడ్డీకే బంగారం పై లోన్ కావాలా..అయితే ఈ బ్యాంకులు బెటర్

తక్కువ వడ్డీకే బంగారం పై లోన్ కావాలా..అయితే ఈ బ్యాంకులు బెటర్

Update: 2023-04-29 02:30 GMT

తక్కువ వడ్డీకే బంగారం పై లోన్ కావాలా..అయితే ఈ బ్యాంకులు బెటర్ 

Gold Loan: బంగారం చేతిలో ఉంటే ఈజీగా రుణం లభిస్తుందని మనందరికీ తెలిసిన విషయమే. ఇతర లోన్లతో కంపేర్ చేస్తే తక్కువ డాక్యుమెంటేషన్ ఉంటుంది. అలాగే రుణం కూడా వెంటనే అందుతుంది. బంగారు తనఖా రుణాల కోసం ఆర్థిక సంస్థలు ఆకర్షణీయమైన వడ్డీ రేట్ల సేవలతో పోటీపడుతున్నాయి. గోల్డ్ లోన్ కోసం ప్రముఖ బ్యాంకులు అందించే వడ్డీ రేట్లను ఇప్పుడు తెలుసుకుంద్దాం

HDFC బ్యాంక్: ఇతర బ్యాంకులతో పోల్చితే హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ అన్నింటికన్నా చాలా తక్కువకే బంగారంపై రుణాలు ఇస్తోంది. ఈ బ్యాంక్ 7.20 శాతం నుంచి 16.50 శాతం వరకు వడ్డీ రేట్లు ఉన్నాయి. ప్రాసెసింగ్ ఫీజు 1 శాతం వసూలు చేస్తోంది.

KOTAK MAHINDRA BANK: తక్కువ వడ్డీకే బంగారం పై రుణాలు అందిస్తున్న బ్యాంకుల జాబితాలో కొటాక్ మహీంద్ర బ్యాంక్ రెండవ స్థానంలో ఉంది. ఈ బ్యాంకులో 8 శాతం నుంచి 17 శాతం వరకు వడ్డీ రేట్లు ఉన్నాయి. ప్రాసెసింగ్ ఫీజు లోన్ మొత్తం పై 2 శాతం ప్లస్ జీఎస్ టీ వసూలు చేస్తోంది.

SOUTH INDIA BANK: ఈ బ్యాంక్ 3వ స్థానంలో నిలుస్తోంది. గోల్డ్ లోన్ 8.25 శాతం నుంచి 19 శాతం వరకు ఉంది.

CENTRAL BANK OF INDIA: ఈ బ్యాంక్ 8.45 శాతం నుంచి 8.55 శాతం వరకు వడ్డీ రేట్లు విధిస్తోంది. ఇందులో ప్రాసెసింగ్ ఫీజు కింద లోన్ మొత్తంలో 0.50 శాతం వసూలు చేస్తోంది.

FEDERAL BANK: ఇక ఫెడరల్ బ్యాంక్ విషయానికొస్తే ఇందులో 9.49 శాతం వరకు వడ్డీ రేట్లు ఉన్నాయి.

చిన్న వ్యాపారుల వద్ద బంగారం తాకట్టు పెట్టి రుణం తీసుకోవడం సరైంది కాదు. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు సరైన భద్రత కూడా ఉండకపోవచ్చు. బ్యాంకుల్లో బంగారం తనఖా పెట్టి రుణం తీసుకుంటే..తీసుకునే నగదు ఉపయోగపడడమే కాకుండా తనఖా పెట్టిన బంగారం సేఫ్ ప్లేస్ లో ఉంటుంది. అంటే మన బంగారాన్ని సేఫ్ డిపాజిట్ చేసినట్లవుతుంది. ఏదిఏమైనా, గోల్డ్ లోన్ పై ఆధారపడడం అనేది వ్యక్తిగత వ్యాపార అవసరాల కోసం డబ్బు పొందడానికి సులభమైన మార్గాల్లో ఒకటి.

Tags:    

Similar News