Post Office: పోస్టాఫీస్‌ పథకాల్లో చేరారా.? ఆన్‌లైన్‌లోనే ఇలా చెల్లించండి..!

Post Office: ప్రస్తుతం పొదుపు మంత్రం పాటిస్తోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

Update: 2024-08-16 15:30 GMT

Post Office: పోస్టాఫీస్‌ పథకాల్లో చేరారా.? ఆన్‌లైన్‌లోనే ఇలా చెల్లించండి..!

Post Office: ప్రస్తుతం పొదుపు మంత్రం పాటిస్తోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా భవిష్యత్ అవసరాల దృష్ట్యా పొదుపు చేస్తున్నారు. మారుతోన్న ఆర్థిక అవసరాలు, పెరుగుతోన్న ఖర్చుల నేపథ్యంలో ప్రతీ ఒక్కరికీ ఆర్థికపరమైన క్రమ శిక్షణ పెరుగుతోంది. దీంతో చాలా మంది డబ్బును పొదుపు చేస్తున్నారు. అయితే కష్టపడి సంపాదించిన డబ్బుకు సెక్యూరిటీ ఉండాలనే ఉద్దేశంతో చాలా మంది ప్రభుత్వ రంగ సంస్థల్లోనే పెట్టుబడి పెడుతున్నారు.

ఇలాంటి వాటిల్లో పోస్టాఫీస్‌ మొదటి స్థానంలో ఉంటోంది. ప్రస్తుతం పోస్టాఫీస్‌లో ఎన్నో రకాల పథకాలను అందిస్తున్నారు. అన్ని రకాల వర్గాలకు మేలు జరిగేలా వివిధ రకాల ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఆకర్షణీయమైన వడ్డీ, మంచి రిటర్న్స్‌ వచ్చే అవకాశం ఉండడంతో చాలా మంది పోస్టాఫీస్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే పోస్టాఫీస్‌లో ప్రీమియం చెల్లించాల్సి వచ్చినప్పుడల్లా ఆఫీస్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే మారుతోన్న కాలంతో పాటు పోస్టాఫీస్‌లోనూ సేవలు మారుతున్నాయి.

ఆన్‌లైన్‌లోనే ప్రీమియం చెల్లించేలా వెసులుబాటు కల్పించారు. ఇందుకోసం ఇండియన్‌ పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ పేరుతో ఓ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంతకీ యాప్‌ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇందుకోసం ముందుగా ప్లేస్టోర్‌ నుంచి ఐపీపీబీ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. మీరు పోస్ట్‌ ఆఫీసులో అంతకుముందే డిజిటల్‌ అకౌంట్ ఓపెన్‌ చేసుకునే సమయంలో ఇచ్చే లాగిన్ వివరాల ద్వారా యాప్‌లోకి లాగిన్‌ కావాల్సి ఉంటుంది. రిజిస్టర్‌ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్‌ చేయడం ద్వారా యాప్‌లోకి లాగిన్‌ కావాలి.

అనంతరం యాప్‌లో కనిపించే PSOB స్వీప్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. అందులో మీరు పొదుపు ఖాతా నుండి డిజిటల్ ఖాతాకు అవసరమైన డబ్బును బదిలీ చేయవచ్చు. దీని తరువాత, “పోస్ట్ ఆఫీస్ సర్వీసెస్” అనే ఆప్షన్ ఉంటుంది. మీరు ఉపయోగిస్తున్న ప్రోగ్రామ్‌పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఖాతా నంబర్, డబ్బు మొత్తం, ఎన్ని వాయిదాలు నమోదు చేస్తే మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయగానే మీ పొదుపు ఖాతాల్లోకి డబ్బు వెళ్తుంది. 

Tags:    

Similar News