ATM Card: ఏటీఏం కార్డ్‌పై ఉన్న 16 అంకెల్లో కీలక సమాచారం దాగుందని మీకు తెలుసా.. వాటి అర్థం ఏంటంటే?

ATM Card: ఏటీఎం కార్డుపై రాసివున్న నంబర్ల అర్థం ఏమిటో మీరు ఎప్పుడైనా గమనించారా? ATMలో ఉన్న 16 నంబర్‌లు చాలా ముఖ్యమైనవి. వాటికి మీ బ్యాంక్ ఖాతాతో నేరుగా కనెక్షన్ ఉంది.

Update: 2023-06-23 16:00 GMT

ATM Card: ఏటీఏం కార్డ్‌పై ఉన్న 16 అంకెల్లో కీలక సమాచారం దాగుందని మీకు తెలుసా.. వాటి అర్థం ఏంటంటే?

16 Digit Numbers In ATM Card: ఏటీఏం కార్డ్ ప్రజల జీవితాన్ని చాలా సులభతరం చేసింది. దీంతో లావాదేవీల ప్రక్రియ చాలా సులువుగా మారింది. ప్రస్తుతం డిజిటల్ లావాదేవీలు వేగంగా పెరిగిన నేపథ్యంలో వీటి అవసరం చాలా ఎక్కువగా మారింది. డిజిటల్ చెల్లింపులు, ఏటీఎం కార్డులతో నగదును తీసుకెళ్లే కష్టాలు తీరిపోయి జీవితం మరింత సులభతరమైంది. అయితే ఏటీఎం కార్డుపై రాసివున్న నంబర్లకు అర్థం ఏమిటో ఎప్పుడైనా గమనించారా? వాస్తవానికి, ATMలో గుర్తించిన 16 నంబర్‌లు చాలా ముఖ్యమైనవి. వాటికి మీ బ్యాంక్ ఖాతాతో నేరుగా కనెక్షన్ ఉంటుందని మీకు తెలుసా?

ATM కార్డ్‌పై రాసిన మొదటి అంకె కనెక్షన్ దానిని జారీ చేసే పరిశ్రమతో ఉంటుంది. దీనిని మేజర్ ఇండస్ట్రీ ఐడెంటిఫైయర్ అని కూడా అంటారు. ఈ సంఖ్యలు ప్రతి పరిశ్రమకు భిన్నంగా ఉంటాయి.

తదుపరి 5 సంఖ్యలను జారీదారు గుర్తింపు సంఖ్య అంటారు. ఏ కంపెనీ కార్డు జారీ చేసిందో అది చెబుతుంది. ఆ తర్వాత, 7వ నంబర్ నుంచి 15వ నంబర్ వరకు రాసిన నంబర్లు నేరుగా మీ బ్యాంక్ ఖాతాకు కనెక్ట్ అయి ఉంటాయి. అయితే, ఇవి మీ ఖాతా నంబర్‌లు కావు. కానీ, ఖచ్చితంగా ఖాతా నంబర్‌కి లింక్ చేయబడి ఉంటాయి.

అదే సమయంలో కార్డుపై గుర్తించిన 16వ సంఖ్యలు ATM కార్డు చెల్లుబాటును తెలియజేస్తుంది. ఈ సంఖ్యను చెక్‌సమ్ అంకె అని కూడా అంటారు. అంటే ఏటీఎం కార్డుపై ముద్రించిన 16 నంబర్లకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.

Tags:    

Similar News