Buying Car: కారు కొన్నవెంటనే ఈ పనిచేయండి.. డబ్బు ఆదా అవుతుంది..!

Buying Car: దేశంలో కార్ల విక్రయాలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి.

Update: 2023-03-28 06:07 GMT

Buying Car: కారు కొన్నవెంటనే ఈ పనిచేయండి.. డబ్బు ఆదా అవుతుంది..!

Buying Car: దేశంలో కార్ల విక్రయాలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. అయితే కారు కొన్న తర్వాత దాని మెయింటెనెన్స్‌ కూడా చాలా ముఖ్యం. కొత్త కారు కొనేముందు కొన్నివిషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి. లేదంటే తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. వాస్తవానికి కారు కొనుగోలు చేసేటప్పుడు కారు బీమా విషయంలో అలర్ట్‌గా ఉండాలి. సరైన కారు బీమాను ఎంచుకుంటే అది డబ్బును ఆదా చేస్తుంది. ప్రీమియం కూడా తక్కువగా ఉంటుంది. దీని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.

థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్

కారు కొనుగోలుతో పాటు కారు బీమా తీసుకోవడం కూడా అవసరమే. ప్రమాదం జరిగినప్పుడు కారుకు కలిగే నష్టాన్ని బీమా ద్వారా భర్తీ చేయవచ్చు. ఒకవేళ కారుకు బీమా లేకపోతే జరిమానా విధిస్తారు. ఈ పరిస్థితిలో థర్డ్ పార్టీ బీమా పొందడం చాలా ముఖ్యం.

అవసరాన్ని బట్టి పాలసీ

అయితే ఈ పాలసీని గుడ్డిగా నమ్మవద్దు. ఎల్లప్పుడూ అవసరానికి అనుగుణంగా పాలసీని ఎంచుకోవడం ఉత్తమం. మీరు కారును కొనుగోలు చేసినప్పుడు అనేక పాలసీల గురించి చెబుతారు. ముందుగా మీ అవసరాన్ని గుర్తించి ఏ పాలసీ అయితే కవరేజీ బాగుంటుందో దానిని ఎంచుకోవాలి. అప్పుడే మీరు తక్కువ ప్రీమియంతో సరైన పాలసీని కొనుగోలు చేస్తారు. పాలసీ తీసుకునేటప్పుడు మార్కెట్‌లో లభించే అన్ని కంపెనీల ప్రీమియాలని సరిపోల్చండి.

మరింత కవరేజ్

మీరు కొత్త కారును కొనుగోలు చేసినట్లయితే సమగ్ర మోటార్ బీమా పాలసీని తీసుకుంటే ఉత్తమం. ఈ పాలసీ కింద వరదలు, భూకంపాలు, తుఫానులు, విపత్తుల వల్ల కలిగే నష్టాల వల్ల కవరేజీ పొందవచ్చు. ఈ పాలసీ అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంటుంది.

Tags:    

Similar News