Investment Plans: ఈ మ్యూచ్‌వల్ ఫండ్స్‌లో SIP చేయండి.. పదేళ్లలో కోటీశ్వరులవుతారు..!
Investment Plans: డబ్బు సంపాదించడం ఎవరైనా చేస్తారు కానీ వాటిని తెలివిగా పెట్టుబడి పెట్టినవారు మాత్రమే జీవితంలో పైకి వస్తారు.
Investment Plans: డబ్బు సంపాదించడం ఎవరైనా చేస్తారు కానీ వాటిని తెలివిగా పెట్టుబడి పెట్టినవారు మాత్రమే జీవితంలో పైకి వస్తారు. కోటీశ్వరులు కావాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ అందరు కాలేరు. ఎంత డబ్బు సంపాదించినా కొంతమంది కోటీశ్వరులు కాలేరు కానీ తక్కువ డబ్బుతో కూడా కోటీశ్వరులు అయినా వారు ఉన్నారు. మార్కెట్‌లో పెట్టుబడి ఎంపికలు చాలా ఉన్నాయి కానీ ఎందులో ఇన్వెస్ట్ చేయాలో తెలిసి ఉండాలి. అప్పుడే భవిష్యత్‌లో పెద్ద నిధిని సేకరిస్తారు కోటీశ్వరులుగా మారుతారు.
ఈ రోజుల్లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) గొప్ప ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ అని చెప్పవచ్చు. ఇది సాధారణ పొదుపు ఖాతా అలాగే ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే ఎక్కువ రాబడిని అందిస్తుంది. అలాగే మీకు కావలసినప్పుడు డబ్బును విత్‌డ్రా చేసుకునే సదుపాయం ఉంటుంది. పొదుపు కోసం మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్ చేయవచ్చు. అయితే ఎలాంటి మ్యూచ్‌వల్ ఫండ్స్‌లో సిప్ చేస్తే తొందరగా కోటీశ్వరులు అవుతారో ఈరోజు తెలుసుకుందాం.
క్వాంట్ యాక్టివ్ ఫండ్
క్వాంట్ యాక్టివ్ ఫండ్ SIP 10 సంవత్సరాలలో పెట్టుబడిదారులకు 22.50% రాబడిని అందించింది. మిగిలిన రెగ్యులర్ ప్లాన్‌లు 21.69% రాబడిని అందించాయి. క్వాంట్ యాక్టివ్ ఫండ్ ప్లాన్ ధనవంతులు కావడానికి అవకాశం కల్పిస్తోంది.
ఇన్వెస్కో ఇండియా మల్టీక్యాప్ ఫండ్
ఇన్వెస్కో ఇండియా మల్టీక్యాప్ ఫండ్ తన పెట్టుబడిదారులకు 19.71% రాబడిని అందించింది. ఈ రిటర్న్ 10 సంవత్సరాల SIPపై ఈ రాబడిని అందించింది. అలాగే రెగ్యులర్ ప్లాన్‌లపై 17.99% రాబడి అందించింది. ప్రతినెలా 25 వేల SIPతో 93 లక్షల నిధులను సేకరించడానికి అవకాశం కల్పిస్తోంది.
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మల్టీక్యాప్ ఫండ్
ఐసీఐసీఐ బ్యాంక్ మల్టీక్యాప్ ఫండ్ తన పెట్టుబడిదారులకు 10 సంవత్సరాల SIPలో 17.02% రాబడిని అందిస్తోంది. అదే సమయంలో సాధారణ ప్లాన్‌లపై 15.97% రాబడి అందిస్తోంది. 10 సంవత్సరాల పాటు 25000 సిప్ చేయడం వల్ల 78 లక్షల రూపాయల భారీ రాబడిని పొందవచ్చు.