Money Saving Tips: పండుగ సమయంలో డబ్బులు వృథా చేయవద్దు.. ఇలా ఆదా చేయండి..!
Money Saving Tips: నెలవారీ జీతంపై బతికే ఉద్యోగులు తరచుగా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. డబ్బులు ఆదాచేయకపోవడం వల్ల అత్యవసర సమయాల్లో అప్పులు చేస్తుంటారు.
Money Saving Tips: నెలవారీ జీతంపై బతికే ఉద్యోగులు తరచుగా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. డబ్బులు ఆదాచేయకపోవడం వల్ల అత్యవసర సమయాల్లో అప్పులు చేస్తుంటారు. అయితే చాలామంది పండుగలు, ఫంక్షన్లు వచ్చినప్పుడు విపరీతంగా ఖర్చుచేస్తున్నారు. దీనివల్ల మనీ సేవింగ్ చేయకుండా ఏ నెల జీతం ఆ నెల ఖర్చవుతుంది. ఇలాంటి సమయంలో కొన్ని చిట్కాలను పాటించి డబ్బు ఆదా చేసుకోవచ్చు. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.
బడ్జెట్ తయారు చేసుకోండి
పండుగలకు, పంక్షన్లకు ఎంత ఖర్చు పెట్టబోతున్నారో ముందుగానే బడ్జెట్ వేసుకోండి. దీని ప్రకారమే షాపింగ్ చేయండి. అవసరమైన వస్తువులను మాత్రమే కొనుగోలు చేయండి.
ప్రతి పైసాను ట్రాక్ చేయండి
ప్రతి లావాదేవీని ట్రాక్ చేయాలి. ప్రతి రూపాయి ఎక్కడ ఖర్చు అవుతుందో తెలుసుకోవాలి. దీనివల్ల అనవసరంగా ఎక్కడ ఖర్చు చేస్తున్నారో తెలుస్తుంది. ఈ వృధా ఖర్చును అరికట్టడం ద్వారా డబ్బు ఆదా అవుతుంది.
తెలివిగా షాపింగ్ చేయండి
ప్రజలు షాపింగ్‌కు వెళ్లినప్పుడల్లా చాలాసార్లు తమకు అవసరం లేని వస్తువులను కొనుగోలు చేస్తారు. అలాగే పండుగ సీజన్‌లో లభించే డిస్కౌంట్‌లను చూసి మోసపోవద్దు. అనవసరమైన వస్తువులను కొనుగోలు చేయవద్దు. పండుగల సందర్భంగా తెలివిగా షాపింగ్ చేయండి. అప్పుడే పండుగ సమయంలో అవసరమైన వస్తువుల కోసం డబ్బు ఆదా చేయగలుగుతారు.
పొదుపు
ప్రతి నెలా జీతం రాగానే కొంత మొత్తాన్ని పక్కన పెట్టి పొదుపు చేసుకోవాలి. ఎంత మొత్తం పొదుపు చేయగలుగుతున్నారన్నది ముఖ్యం కాదు. సేవ్ చేయడం ముఖ్యం.