Health Insurance: హెల్త్‌ ఇన్సూరెన్స్‌ విషయంలో ఈ తప్పులు చేయవద్దు.. క్లెయిమ్‌ తిరస్కరిస్తారు జాగ్రత్త..!

Health Insurance: ఈ రోజుల్లో హెల్త్‌ ఇన్సూరెన్స్‌ అనేది చాలా ముఖ్యం. ఒక వ్యక్తి పని చేయడం ప్రారంభించిన వెంటనే చేయాల్సిన మొదటి పని హెల్త్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోవడం.

Update: 2023-09-11 15:30 GMT

Health Insurance: హెల్త్‌ ఇన్సూరెన్స్‌ విషయంలో ఈ తప్పులు చేయవద్దు.. క్లెయిమ్‌ తిరస్కరిస్తారు జాగ్రత్త..!

Health Insurance: ఈ రోజుల్లో హెల్త్‌ ఇన్సూరెన్స్‌ అనేది చాలా ముఖ్యం. ఒక వ్యక్తి పని చేయడం ప్రారంభించిన వెంటనే చేయాల్సిన మొదటి పని హెల్త్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోవడం. దీనివల్ల మీ పై ఆధారపడిన వారికి భరోసా కల్పించినట్లవుతుంది. అయితే ఈ ఇన్సూరెన్స్‌ తీసుకునేటప్పుడు కచ్చితంగా కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. లేదంటే క్లెయిమ్‌ తిరస్కరణకి గురవుతుంది. హెల్త్‌ పాలసీ విషయంలో ఎలాంటి తప్పులు చేయకూడదో ఈ రోజు తెలుసుకుందాం.

దావా ప్రక్రియ

హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ కొన్ని నిబంధనలకి లోబడి పాలసీలని అందిస్తుంది. కాబట్టి క్లెయిమ్‌ ప్రాసెస్ చేస్తున్నప్పుడు సూచించిన ప్రమాణాలను కచ్చితంగా పాటించాలి. సరైన పత్రాలు లేకుంటే క్లెయిమ్‌ తిరస్కరిస్తారు.

ఇప్పటికే ఉన్న వ్యాధులు

పాలసీని తీసుకునేటప్పుడు గతంలో ఉండే వ్యాధులు కవర్‌ కావు. ఈ వ్యాధుల కారణంగా అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరవలసి వస్తే చికిత్స ఖర్చును ఇన్సూరెన్స్‌ కంపెనీ భరించదు. ఈ పరిస్థితిలో క్లెయిమ్ తిరస్కరణకి గురవుతుంది.

పాలసీ వ్యవధి

ఆరోగ్య బీమా పాలసీలు సాధారణంగా ఒక సంవత్సరం కాలపరిమితిని కలిగి ఉంటాయి. పాలసీ గడువు సంవత్సరం చివరిలో ముగుస్తుంది. దీనివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. ఈ పరిస్థితిలో పాలసీని రెన్యూవల్‌ చేసుకోవాలి. లేదంటే పాలసీ లాప్స్ అవుతుంది. దీనివల్ల ఎటువంటి క్లెయిమ్ చేయలేరు.

వెయిటింగ్ పీరియడ్

హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అంటే కొన్ని రకాల వ్యాధులకి ఇన్సూరెన్స్ కవర్ ప్రయోజనాలను పొందడానికి కొంత కాలం వరకు వేచి ఉండాలి. ఈ వ్యవధి ఇన్సూరెన్స్‌ కంపెనీల నిబంధనలు, షరతులపై ఆధారపడి ఉంటుంది. ఈ సందర్భంలో క్లెయిమ్‌ తిరస్కరణకి గురవుతుంది.

కొన్ని ప్రత్యేక సందర్భాలు

ప్రతి పాలసీకి కొన్ని షరతులు ఉంటాయి. వీటిని కచ్చితంగా చదవాలి. లేదంటే చిక్కుల్లో పడుతారు. ఏదైనా సందేహం ఉంటే కంపెనీ ప్రతినిధులతో చర్చించాలి. లేదంటే ఆపదలో మీ క్లెయిమ్‌ తిరస్కరణకి గురవుతుంది. దీనివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు.

Tags:    

Similar News