వీఆర్ఎస్ తీసుకునే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. లేదంటే ఇబ్బందులు తప్పవు..!

VRS Planning: మీరు ఉద్యోగంలో 40 సంవత్సరాలు పూర్తయిన తర్వాత లేదా 10 సంవత్సరాల సర్వీస్ కంప్లీట్‌ అయిన తర్వాత స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (VRS) తీసుకోవచ్చు.

Update: 2022-12-03 12:28 GMT

వీఆర్ఎస్ తీసుకునే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. లేదంటే ఇబ్బందులు తప్పవు..!

VRS Planning: మీరు ఉద్యోగంలో 40 సంవత్సరాలు పూర్తయిన తర్వాత లేదా 10 సంవత్సరాల సర్వీస్ కంప్లీట్‌ అయిన తర్వాత స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (VRS) తీసుకోవచ్చు. అయితే దీనికి ముందు కుటుంబం కోసం భవిష్యత్తు ప్రణాళికను రూపొందించుకోవాలి. లేదంటే చాలా సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకి వీఆర్‌ఎస్‌ సదుపాయం ఉంటుంది. అంతేకాకుండా కొన్ని ప్రత్యేక పరిస్థితులలో కంపెనీ స్వయంగా VRS పథకాన్ని అమలు చేస్తుంది. ఉద్యోగులకి అకాల రిటైర్మెంట్‌ ప్రకటిస్తుంది.

ఉద్యోగి స్వయంగా VRS తీసుకోవాలని నిర్ణయించుకుంటే అతను 3 నెలల ముందుగానే నియామక అధికారికి నోటీసు ఇవ్వాలి. అతను వీఆర్‌ఎస్‌ తీసుకోవడానికి సరిపడ సర్వీసుని పూర్తి చేసినట్లు స్పష్టం చేయాలి. వీఆర్‌ఎస్‌ తీసుకున్నప్పుడు గ్రాట్యుటీ, పెన్షన్, ప్రావిడెంట్ ఫండ్ వంటి ప్రయోజనాలు కూడా కల్పిస్తారు. ఇది కాకుండా పోస్ట్-రిటైర్మెంట్ మెడికల్ కవర్ ఉంటుంది. మీరు పనిచేసే కంపెనీలో ఇది ఉంటే VRS తర్వాత అది కూడా మీకు వర్తిస్తుంది. అయితే వీఆర్‌ఎస్‌ తీసుకునే ముందు మీకు ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో ఒక్కసారి విశ్లేషించుకోవాలి.

వీఆర్‌ఎస్ తీసుకోకుంటే బోనస్, ఇంక్రిమెంట్ ఎంత మొత్తం వస్తుంది. ఈ లెక్కన వీఆర్‌ఎస్ తీసుకోవాలా వద్దా అనేది అర్థమవుతుంది. ఉద్యోగంలో ఇంకా 5 లేదా 3 సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉంటే దానిని పూర్తి చేసి సరైన పదవీ విరమణ తీసుకోవడం మంచిది. VRS తీసుకున్న తర్వాత మీ ఆదాయం ఆగిపోతుంది. మీరు VRS సమయంలో పొందిన డబ్బునే మెయింటెనెన్స్‌ చేయాల్సి ఉంటుంది. ఆర్థిక సంక్షోభం రాకుండా ఉండటానికి ఏదైనా ఉపాధి లేదా ఉద్యోగం కానీ చూసుకోవాలి. అప్పుడే నిలకడైన ఆదాయం ఉంటుంది.

Tags:    

Similar News