Muhurat Trading: దీపావళి ముహూరత్ ట్రేడింగ్ టైమ్ ఇదే..
Muhurat Trading: ఈ దీపావళి రోజున 6 నుంచి 7.15 మధ్య ముహూరత్ ట్రేడింగ్
Muhurat Trading: దేశంలోని అనేక మంది స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. దీపావళికి ప్రత్యేకంగా నిర్వహించే ముహురత్ ట్రేడింగ్ రేపు ఒక గంట పాటు నిర్వహించనున్నారు. దేశీయంగా హిందువులు దీపావళి నుంచి కొత్త పనులు ప్రారంభించటానికి మంచి కాలంగా పరిగణిస్తుంటారు. ముహురత్ ప్రత్యేక ట్రేడింగ్ సమయంలో ఈక్విటీ, కమోడిటీ డెరివేటివ్స్, కరెన్సీ డెరివేటివ్స్, ఈక్విటీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, సెక్యూరిటీస్ లెండింగ్ అండ్ బారోయింగ్ లలో వ్యాపారం జరుగుతుంది.
రేపు సాయంత్రం 5.45 గంటలకు బ్లాక్ డీల్ సెషన్ ప్రారంభమౌతుంది. అలాగే సాయంత్రం 6 నుంచి 6.08 వరకు ప్రీ ఓపెనింగ్ సెషన్ 8 నిమిషాల పాటు కొనసాగనుంది. మెుత్తంగా ప్రీమార్కెట్ సెషన్ 15 నిమిషాలు ఉంటుంది. ఈ క్రమంలో కమోడిటీస్, కరెన్సీ డెరివేటివ్స్ విభాగంలో ట్రేడింగ్ 6.15 నుంచి 7.15 మధ్య కాలంలో సాయంత్రం నిర్వహించబడుతుంది.