RBI Rule: మీరు అనుకోకుండా వేరే ఖాతాకి డబ్బులని బదిలీ చేశారా..!
RBI Rule: మీరు అనుకోకుండా వేరే ఖాతాకి డబ్బులని బదిలీ చేశారా..!
RBI Rule: కరోనా వల్ల డిజిటల్ లావాదేవీలలో భారీ పెరుగుదల ఉంది. ప్రస్తుతం డిజిటల్ వాలెట్లు, NEFT / RTGS, UPI, Google Pay, BHIM యాప్ ద్వారా సులభంగా డబ్బులు పంపుతున్నారు. రిసీవ్ చేసుకుంటున్నారు. వీటి వల్ల నగదు బదిలీ సులువుగా మారినా కొన్ని తప్పులు జరుగుతూనే ఉన్నాయి. చాలా సార్లు డబ్బు బదిలీ చేసేటప్పుడు బ్యాంక్ ఖాతా నంబర్‌ను పొరపాటుగా ఎంటర్ చేయడం ద్వారా అది వేరే ఖాతాకు బదిలీ అవుతుంది. ఇలాంటి సమయంలో ఏం చేయాలో రిజర్వ్ బ్యాంకు ఏం చెబుతుందో తెలుసుకుందాం.
పొరపాటున వేరొకరి బ్యాంక్ ఖాతాకు డబ్బు బదిలీ అయినప్పుడు ముందుగా ఫోన్ లేదా ఈ మెయిల్ ద్వారా బ్యాంకుకు తెలియజేయాలి. వీలైనంత త్వరగా బ్రాంచ్ మేనేజర్‌ని కలిస్తే మంచిది. మీ బ్యాంక్ కస్టమర్ కేర్ సెంటర్‌కి కాల్ చేసి అన్నీ చెప్పండి. బ్యాంక్ మొత్తం సమాచారాన్ని ఈ-మెయిల్ ద్వారా అడిగితే లావాదేవీకి సంబంధించిన పూర్తి వివరాలను మెయిల్ చేయండి. ఇందులో లావాదేవీ తేదీ, సమయం, మీ ఖాతా నంబర్, డబ్బు ఎక్కడికి పంపబడింది, దాని ఖాతా నంబర్ వంటి మొత్తం ఉండాలి.
కొన్నిసార్లు బ్యాంకులు ఇటువంటి కేసులను పరిష్కరించేందుకు 2 నెలల వరకు సమయం తీసుకోవచ్చు. ఏ నగరంలోని ఏ శాఖలో ఏ ఖాతాకి డబ్బు బదిలీ అయిందో మీరు మీ బ్యాంకు నుంచి సులభంగా తెలుసుకోవచ్చు. ఆ శాఖతో మాట్లాడి మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. పొరపాటున వేరొకరి ఖాతాకు డబ్బును బదిలీ చేసిన చాలా సందర్భాలలో రిసీవర్ డబ్బును తిరిగి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. అతను డబ్బును తిరిగి ఇవ్వడానికి నిరాకరిస్తే మీరు అతనిపై కేసు నమోదు చేయవచ్చు. కావాలంటే మీరు బ్యాంకులో ఫిర్యాదు చేయవచ్చు. చట్టపరమైన చర్య తీసుకోవచ్చు. పొరపాటున వేరొకరి ఖాతాలో డబ్బు జమ అయితే బ్యాంకులు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆర్‌బిఐ ఆదేశించింది.