LIC: ప్రతిరోజు రూ.150 పొదుపుతో రూ.19 లక్షల లాభం..!
LIC Children Money Back Policy: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) దేశంలోని అతిపెద్ద బీమా సంస్థ.
LIC Children Money Back Policy: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) దేశంలోని అతిపెద్ద బీమా సంస్థ. ఇది అన్ని వర్గాల వారికి పాలసీలని రూపొందిస్తుంది. అందులో భాగంగా పిల్లల కోసం ఒక ప్రత్యేక పాలసీని ప్రవేశపెట్టింది. ఇందులో రోజుకు రూ.150 పెట్టుబడి పెట్టడం ద్వారా దాదాపు రూ.14 లక్షలు సంపాదించవచ్చు. ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
వాస్తవానికి మీరు పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతుంటే ఈ స్కీం బెటర్ అని చెప్పవచ్చు. దీనిపేరు ఎల్‌ఐసీ కొత్త చిల్డ్రన్ మనీ బ్యాక్ పాలసీ. ఈ స్కీం నాన్-లింక్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ. ఇందులో పెట్టుబడిదారులు హామీతో కూడిన రాబడి, బోనస్‌లను పొందుతారు. మీరు ఈ ప్లాన్‌లో రోజుకు రూ.150 పెట్టుబడి పెట్టవచ్చు. కాబట్టి వార్షిక ఆదాయం రూ. 55,000 అవుతుంది. 25 సంవత్సరాల తర్వాత డిపాజిట్ మొత్తం రూ.14 లక్షలు అవుతుంది. మెచ్యూరిటీ తర్వాత ఖాతాదారునికి రూ.19 లక్షలు లభిస్తాయి.
మీరు ఈ పాలసీని 25 ఏళ్లపాటు కొనుగోలు చేయవచ్చు. ఈ పథకంలో పిల్లలు 18 సంవత్సరాల తర్వాత మొదటిసారి మనీ బ్యాక్, 20 సంవత్సరాల తర్వాత రెండవ సారి, 22 సంవత్సరాల వయస్సులో మూడోసారి మనీ బ్యాక్‌ని పొందుతారు. మూడు మనీ బ్యాక్‌లలో 20%-20% చెల్లిస్తారు. మెచ్యూరిటీలో పిల్లలకి 25 ఏళ్లు నిండిన తర్వాత మిగతా 40% అందిస్తారు.
పాలసీ నిబంధనలు
1. పిల్లల వయస్సు 0 నుంచి 12 సంవత్సరాల మధ్య ఉండాలి.
2. 60% మనీ బ్యాక్, 40% మెచ్యూరిటీపై చెల్లిస్తారు.
3. అవసరానికి అనుగుణంగా కనీసం రూ.1 లక్ష,గరిష్ట మొత్తాన్ని ఎంచుకోవచ్చు.
4. 25 ఏళ్లపాటు పాలసీని రూపొందించారు. దీనిలో మీరు వాయిదాలలో మెచ్యూరిటీ మొత్తాన్ని పొందుతారు.
5. పిల్లలకి 18 ఏళ్లు వచ్చినప్పుడు మనీబ్యాక్ మొదలవుతుంది.
6. వాయిదాలు చెల్లించకుంటే వడ్డీతో పాటు ఒకేసారి మొత్తం చెల్లిస్తారు.