పారామిలటరీ సిబ్బందికి ఓల్డ్‌ పెన్షన్ స్కీం వర్తింపు.. ప్రయోజనాలు ఏంటంటే..?

*పారామిలటరీ సిబ్బందికి ఓల్డ్‌ పెన్షన్ స్కీం వర్తింపు.. ప్రయోజనాలు ఏంటంటే..?

Update: 2023-01-16 15:30 GMT

పారామిలటరీ సిబ్బందికి ఓల్డ్‌ పెన్షన్ స్కీం వర్తింపు.. ప్రయోజనాలు ఏంటంటే..?

Old Pension Scheme: పారామిలటరీ బలగాల సిబ్బందికి పాత పెన్షన్ స్కీమ్ ప్రయోజనాలను వర్తింపజేయాలని ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సిఎపిఎఫ్) కేంద్ర ప్రభుత్వ సాయుధ దళాలలో భాగమని వాటికి సమానమైన ప్రయోజనాలను అందించాలని జస్టిస్ సురేశ్ కాంత్, జస్టిస్ నీనా కృష్ణ బన్సాల్‌లతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది.

CCS పెన్షన్ రూల్స్, 1972 ప్రకారం CAPF సిబ్బందికి ఓపీఎస్‌ (Old Pension Scheme) ప్రయోజనాలు వర్తిస్తాయి. 8 వారాల్లోగా అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది. నిజానికి CRPF, BSF, CISF, ITBP సిబ్బందికి OPS ప్రయోజనాలను నిరాకరిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన 82 పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు విచారిస్తోంది.

2003 డిసెంబర్ 31 నాటికి రిక్రూట్‌మెంట్ ప్రక్రియ పూర్తయిన పారామిలటరీ సిబ్బందికి OPS ప్రయోజనం అందించారని అయితే వారు జనవరి 1 తర్వాత ఫోర్స్‌లో చేరారని పిటిషనర్లు తెలిపారు. వీరందరికి పాత పెన్షన్ స్కీమ్ వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు. కొత్త పెన్షన్‌ స్కీం (NPS) జనవరి 1, 2004 నుంచి అమలులోకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి రిక్రూట్‌ అయిన ఉద్యోగులకి కొత్త పెన్షన్‌ స్కీం మాత్రమే అమలుచేస్తున్నారు.

Tags:    

Similar News