Loan: లోన్ కోసం అప్లై చేసేముందు కచ్చితంగా ఈ విషయాలు గుర్తుంచుకోండి
Loan: ఈ రోజుల్లో అత్యవసరంగా డబ్బులు అవసరం పడితే వెంటనే అందరికి లోన్స్ గుర్తుకు వస్తాయి.
Loan: ఈ రోజుల్లో అత్యవసరంగా డబ్బులు అవసరం పడితే వెంటనే అందరికి లోన్స్ గుర్తుకు వస్తాయి. దీనికి కారణం చాలా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, యాప్‌లలో సులభంగా లోన్స్ అందించడమే. దీంతో సింపుల్‌గా వారికి కావలసిన సమాచారం అందజేసి లోన్ తీసుకుంటారు. అయితే ఇలాంటి వారి అవసరాలను గుర్తించిన కొన్ని నకిలీ యాప్‌లు వీరిని పర్సనల్ విషయాలను సేకరించి వీరిని మోసగిస్తున్నాయి. అందుకే లోన్ తీసుకునే ముందు అది బ్యాంకు కానీ మరేదైనా యాప్ కానీ ఒక్కసారి తనిఖీ చేసి అన్ని వివరాలు సరిగ్గా ఉంటే అప్పుడు లోన్ కోసం ఆలోచించాలి.
ఆన్‌లైన్ కార్యకలాపాలు పెరగడంతో మోసాల కేసులు కూడా పెరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా చాలా మంది సైబర్ మోసాల బారిన పడుతున్నారు. వాస్తవానికి ఆన్‌లైన్‌లో ఏదైనా పనిచేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేటి కాలంలో అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఎడ్యుకేషన్ లోన్, హోమ్ లోన్, కార్ లోన్ సహా ప్రతిదానికీ మీరు లోన్ తీసుకోవచ్చు. అంతేకాదు ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా చిన్న చిన్న రుణాలు కూడా తీసుకోవచ్చు. అయితే రుణం తీసుకునే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.
వాస్తవానికి, రుణం తీసుకునే ప్రక్రియ చాలా వరకు సులభం అయింది. కానీ రుణం తీసుకునే ముందు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పోర్టల్‌లో కంపెనీ ఆధారాలను తెలుసుకోవాలి. ప్రస్తుత రోజుల్లో ప్రతి వ్యక్తికి అనేక అవసరాలు ఉన్నాయి. దీంతో ఎవరికైనా ఎప్పుడైనా రుణం తీసుకోవచ్చు. కానీ ఎప్పుడూ రుణ మొత్తాన్ని తక్కువగా ఉండేలా చూసుకోవాలి. కచ్చితంగా అవసరమైనప్పుడు మాత్రమే లోన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. అయితే అంతకంటే ముందు మీరు RBI పోర్టల్ నుంచి రుణం తీసుకుంటున్న సంస్థ వివరాలను తనిఖీ చేయాలి.
తెలియని యాప్‌లను ఇన్‌స్టాల్ చేయడం మానుకోవాలి. వెరిఫై బ్యాడ్జ్ లేకుండా లోన్ అందించే చాలా మంది వ్యక్తులు తెలియని యాప్‌లను ఇన్‌స్టాల్ చేస్తారు. దీని కారణంగా రుణం పొందడం దేవుడెరుగు కానీ వ్యక్తిగత సమాచారం మోసగాళ్లకు చేరుతుంది. కాబట్టి ఏదైనా యాప్‌ను ఇన్‌స్టాల్ చేసే ముందు దాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయడం చాలా ముఖ్యం. అలాగే మీరు రుణం కోసం ఎక్కడ దరఖాస్తు చేస్తున్నారు, ఎవరైనా ఇంతకు ముందు రుణం తీసుకున్నారా అనే విషయాలను తనిఖీ చేయడం మంచిది.