Second Hand Car: సెకండ్‌ హ్యాండ్‌ కారు కొంటున్నారా.. ఈ విషయాలు గమనించండి..?

Second Hand Car: కరోనా పుణ్యమా అని సెకండ్‌ హ్యాండ్‌ కార్లకి విపరీతంగా డిమాండ్‌ పెరిగింది. ఎందుకంటే చాలామంది పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్స్‌ని నమ్మడం లేదు.

Update: 2022-02-02 12:30 GMT

Second Hand Car: సెకండ్‌ హ్యాండ్‌ కారు కొంటున్నారా.. ఈ విషయాలు గమనించండి..?

Second Hand Car: కరోనా పుణ్యమా అని సెకండ్‌ హ్యాండ్‌ కార్లకి విపరీతంగా డిమాండ్‌ పెరిగింది. ఎందుకంటే చాలామంది పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్స్‌ని నమ్మడం లేదు. సొంత వాహనాల వైపే మొగ్గు చూపుతున్నారు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో సేప్టీ తక్కువగా ఉండటం వల్ల భయపడుతున్నారు. ఈ కారణాల వల్ల గత ఏడాది కాలం నుంచి సెకండ్‌ హ్యాండ్ కార్ల కొనుగోళ్లు విపరీతంగా పెరిగాయి. దీని మార్కెట్ కూడా చాలా విస్తరించింది. కొత్తకారు కంటే సెకండ్‌ కార్ల వైపే చాలామంది మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే బడ్జెట్‌ ధరలో వస్తుంది.. అనుకూలంగా ఉంటుందని నమ్ముతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ సెకండ్ హ్యాండ్‌ కారు కొనేటప్పుడు కొన్ని విషయాలు కచ్చితంగా గుర్తుంచుకోవాలి. లేదంటే కస్టమర్‌ చాలా నష్టపోయే అవకాశం ఉంది.

సెకండ్‌ కారు కొనేటప్పుడు కారుని జాగ్రత్తగా పరిశీలించాలి. కారు ఏదైనా ప్రమాదానికి గురైందో తెలుసుకోవాలి. ఆ తర్వాత లోపల కూర్చుని క్యాబిన్‌లోని శబ్దాలు, వైబ్రేషన్‌లపై శ్రద్ధ వహించాలి. విండోను తెరిచి యాక్సిలరేటర్‌ను పెంచేటప్పుడు తగ్గించేటప్పుడు ధ్వనిని జాగ్రత్తగా వినాలి. మీకు ఏదైనా అదనపు శబ్దం, వైబ్రేషన్ అనిపిస్తే కారు డీలర్‌తో మాట్లాడాలి. కారు ఖచ్చితమైన కండీషన్ తెలుసుకోవడానికి కనీసం 20 కిలోమీటర్ల వరకు కారును స్వయంగా నడపండి. టెస్ట్ డ్రైవ్ సమయంలో బర్నింగ్ ఆయిల్ లేదా వైర్ల వాసన ఏదైనా ఉందా గమనించండి. మీరు కారుని మంచి మెకానిక్‌కి చూపించి ఇంజన్‌ని చెక్ చేయించాలి.

సెకండ్‌ కారుని కొనుగోలు చేసేటప్పుడు కారు డీలర్ మోసం చేసే అవకాశాలు ఉంటాయి. కారు గురించి తప్పుడు విషయాలు చెప్పి నమ్మించడానికి ప్రయత్నిస్తారు. కారును కొనుగోలు చేసేటప్పుడు మీరు చేయవలసిన మరో విషయం ఏంటంటే ఫిట్‌నెస్‌ను జాగ్రత్తగా చెక్ చేయడం. కారు సైలెన్సర్ నుంచి వెలువడే పొగ రంగుపై శ్రద్ధ వహించాలి. పొగ రంగు నీలం లేదా నలుపు అయితే అది ఇంజిన్‌లో లోపం ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. అలాగే ఇంజిన్‌లో ఆయిల్ లీకేజీకి సంబంధించిన సమస్య కూడా తనిఖీ చేయాలి. డాక్యుమెంట్లను కూడా క్షుణ్ణంగా పరిశీలించాలి. కారు ఇన్సూరెన్స్‌ ధర, వివరాలు కూడా తెలుసుకోవాలి.

Tags:    

Similar News