Gold Rate: నేల చూపులు చూస్తోన్న పసిడి ధరలు

Gold Rate: నేడు హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర కొద్దిగా తగగ్గా, వెండి ధర మాత్రం స్వల్పంగా పెరిగింది.

Update: 2021-03-24 02:23 GMT

గోల్డ్ రేట్స్:( ఫోటో ది హన్స్ ఇండియా)

Gold Rate: గత రెండు రోజులుగా బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గుతూ వచ్చాయి. హైదరాబాద్ మార్కెట్‌లో వరుసగా రెండో రోజు పసిడి ధర పడిపోయింది. హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.180 తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ. 45,700కి చేరింది. కాగా హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 45,880 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.41,900గా ఉంది. నిన్నటితో పోలిస్తే ఇవాళ రూ.150 తగ్గింది. ఒక్క గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర రూ.4,190గా ఉంది. నేడు 24 క్యారెట్ల మేలిమి బంగారం (ప్యూర్ గోల్డ్) ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ. 45,700 ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.180 తగ్గింది. నేడు హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర కొద్దిగా తగగ్గా, వెండి ధర మాత్రం స్వల్పంగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో, దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం, వెండి రేట్ల వివరాలను ఈ క్రింది విధంగా వున్నాయి.

పలు ప్రధాన నగరాల్లో ధరలు...

దేశంలోని పలు ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్-రూ. 41,900, విశాఖ-రూ. 41,900 , విజయవాడ-రూ. 41,900, ముంబై-రూ. 43,000, చెన్నై-రూ. 42,280, న్యూఢిల్లీ-రూ. 44,050, బెంగళూరు-రూ. 41,900, కోల్‌కతా- రూ.44,400 పలుకుతున్నాయి. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్-రూ. 45,700, విశాఖ-రూ. 45,700 , విజయవాడ-రూ. 45,700 ముంబై-రూ. 44,000, చెన్నై-రూ. 46,120, న్యూఢిల్లీ-రూ. 48,050, బెంగళూరు-రూ. 45,700, కోల్‌కతా-రూ. 47,000 వుంది.

సిల్వర్ ధరలు కింది విధంగా వున్నాయి.

హైదరాబాద్‌లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.70,400గా ఉంది. నిన్నటితో పోలిస్తే కిలో వెండి ధర రూ. 400 పెరిగింది. తులం వెండి ధర ప్రస్తుతం రూ.704గా ఉంది. వెండి (10 గ్రాములు) ధరలు పలు నగరాల్లో ఇలా ఉన్నాయి. హైదరాబాద్-రూ.704, విజయవాడ-రూ. 704, విశాఖ-రూ. 704, ముంబై-రూ. 660, చెన్నై-రూ. 704, న్యూఢిల్లీ-రూ. 660, బెంగళూరు-రూ. 665, కోల్‌కతా- రూ. 660 లుగా పలుకుతోంది.

Tags:    

Similar News