LPG Booking: ఒక్క మిస్డ్ కాల్‌తో సిలిండర్ ఇంటికి.. ఇంకా సబ్సిడీ కూడా..!
LPG Booking: ఒక్క మిస్డ్ కాల్‌తో సిలిండర్ ఇంటికి.. ఇంకా సబ్సిడీ కూడా..!
LPG Booking: ఇప్పుడు వంటగ్యాస్ బుకింగ్‌పై ఆందోళన చెందాల్సిన పనిలేదు. కేవలం చిటికెలో పని అయిపోతుంది. కేవలం ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే సిలిండర్ మీ ఇంటిముందు ఉంటుంది. వాస్తవానికి ఇండియన్ ఆయిల్ (IOC) తన వినియోగదారుల కోసం ఈ సేవను ప్రారంభించింది. ఒక్క మిస్డ్ కాల్ ద్వారా దేశంలోని ఏ ప్రాంతంలోనైనా LPG సిలిండర్‌ను బుక్ చేసుకోవచ్చు. ఈ సదుపాయాన్ని ఫిబ్రవరిలోనే ఐఓసీ ప్రారంభించింది. అంతకుముందు కస్టమర్ కేర్‌కు కాల్ చేసి సిలిండర్ బుకింగ్ కోసం చాలాసేపు హోల్డ్‌లో ఉండాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. కేవలం ఒక మిస్డ్ కాల్‌తో గ్యాస్ సిలిండర్ డెలివరీ అవుతుంది.
ఈ నంబర్‌ను సేవ్ చేయండి
IOC దీని గురించి ఒక ట్వీట్ ద్వారా సమాచారం అందించింది. మిస్డ్ కాల్ కోసం నంబర్‌ను కూడా పేర్కొంది. ఆ నెంబర్ 8454955555. మీరు చేయాల్సిందల్లా మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి ఈ నంబర్‌కు కాల్ చేయడమే. మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కొత్త గ్యాస్ కనెక్షన్‌ను బుక్ చేసుకోవచ్చని ఐఓసి ట్వీట్‌లో తెలిపింది. దీని కోసం కస్టమర్లు ఎలాంటి అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. మిస్డ్ కాల్ కాకుండా గ్యాస్ బుకింగ్ చేయడానికి ఇతర మార్గాలు కూడా ఉన్నాయి. IOC, HPCL, BPCL వినియోగదారులు SMS, Whatsapp ద్వారా కూడా గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకోవచ్చు.
సబ్సిడీలపై గందరగోళం
LPG సబ్సిడీ మళ్లీ ప్రారంభమైంది. వినియోగదారులు ఒక్కో సిలిండర్‌పై రూ.79.26 సబ్సిడీగా పొందుతున్నారు. ఇది ప్రజలు చెబుతున్న మాట. కానీ సబ్సిడీ విషయంలో చాలామంది అయోమయంలో ఉన్నారు. ఎందుకంటే చాలా మందికి రూ.79.26 సబ్సిడీ లభిస్తుండగా, కొంతమందికి రూ.158.52 మరికొంతమందికి రూ.237.78 సబ్సిడీ అందుతోంది. దీనిపై సరైన స్పష్టత కొరవడింది.
Your new #Indane LPG connection only a Missed Call away! Dial 8454955555 and get LPG connection at your doorsteps. Existing Indane customers can also book a refill by giving us a missed call from their registered phone number. pic.twitter.com/LIUXla2zBJ
— Indian Oil Corp Ltd (@IndianOilcl) September 14, 2022