Bitcoin: దూసుకెళ్తున్న బిట్ కాయిన్.. లక్ష డాలర్ల మార్క్ దాటిన క్రిఫ్టో కరెన్సీ..
Bitcoin: బిట్ కాయిన్ డిసెంబర్ 5న లక్ష డాలర్లకు చేరింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనల్డ్ ట్రంప్ విజయం సాధించడంతో క్రిఫ్టో కరెన్సీ బిట్ కాయిన్ విలువ పెరిగిపోతోంది.
Bitcoin: బిట్ కాయిన్ డిసెంబర్ 5న లక్ష డాలర్లకు చేరింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనల్డ్ ట్రంప్ విజయం సాధించడంతో క్రిఫ్టో కరెన్సీ బిట్ కాయిన్ విలువ పెరిగిపోతోంది. నాలుగు వారాల్లో దీని విలువ 45 శాతం పెరిగింది. ఇదే ట్రెండ్ కొనసాగితే బిట్ కాయిన్ 1.20 లక్షల మార్క్ కు చేరుతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
క్రిఫ్టో కరెన్సీని అనుకూలంగా ట్రంప్ అనుకూలంగా ఉన్నారనే సంకేతాలు ఇచ్చారు. ఇదే బిట్ కాయిన్ విలువ పెరగడానికి కారణంగా నిపుణులు చెబుతున్నారు. అమెరికా అధ్యక్ష సమయంలో బిట్ కాయిన్ ధర 69, 374 డాలర్లుగా ఉండింది. అంతకు రెండేళ్ల ముందు దీని విలువ 17 వేల డాలర్లుగా ఉంది. ట్రంప్ తన పాలకవర్గంలో స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ కు డిపార్ట్ మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ బాధ్యతలు అప్పగించడం కూడా ఒక కారణమని మాడ్ రెక్స్ సీఈఓ చెబుతున్నారు.
గతంలో అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన జార్జ్ డబ్ల్యు బుష్ పాలకవర్గంలో ఎస్ ఈ సీ బాధ్యతలు నిర్వహించిన పాల్ అట్కిన్ కు అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజీ కమిషన్ ఎస్ఈసీ ఛైర్మెన్ గా ట్రంప్ నియమించారు. ఇది కూడా బిట్ కాయిన్ విలువ పెరిగేందుకు కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.