India's GDP Fall: కరోనా కారణంగా 40 ఏళ్ల కనిష్టానికి పతనమైన జీడీపీ

India’s GDP Fall: మంచి స్పీడ్‌ మీదున్న ఆర్థిక వ్యవస్థకు కరోనా కల్లోలం బ్రేకులు వేసింది.

Update: 2021-06-01 06:53 GMT

India’s GDP Fall: కరోనా కారణంగా 40 ఏళ్ల కనిష్టానికి పతనమైన జీడీపీ

India's GDP Fall: మంచి స్పీడ్‌ మీదున్న ఆర్థిక వ్యవస్థకు కరోనా కల్లోలం బ్రేకులు వేసింది. వరుస లాక్‌డౌన్లతో దేశ ఆర్థిక వ్యవస్థ నత్తనడకన సాగుతోంది. కరోనా ప్రభావం దేశ జీడీపీపై గట్టిగానే ప‌డింది. గతేడాది 4.2 శాతానికే పరిమితమైన జీడీపీ ఇప్పుడు ఏకంగా 7.3 శాతానికి పడిపోయింది. అంటే దేశ ఆర్థిక వ్యవస్థ 40 ఏళ్ల కనిష్టానికి జారిపోయిందన్నమాట. ఆర్థిక సంవత్సరం చివ‌రన ఎకానమీ కొంత పురోగతి సాధించింది. దీంతో జీడీపీ 1.6 శాతంగా నమోదైందని కేంద్ర గ‌ణాంక‌ కార్యాలయం వెల్లడించింది.

జాతీయ గణాంకాల కార్యాలయం ఆర్థిక సంవత్సరం తాజా గణాంకాలను ఆవిష్కరించింది. 2019 ఏప్రిల్‌–2020 మార్చి మధ్య భారత స్థూల దేశీయోత్పత్తి విలువ 145.69 లక్షల కోట్లు ఉండేది. కరోనా కారణంగా ఈ విలువ 2020 ఏప్రిల్‌–2021 మార్చి మధ్య రూ.135.13 లక్షల కోట్లకు పడిపోయింది. వెరసి 7.3 శాతం క్షీణత నమోదయ్యింది.

మూడవ త్రైమాసికంలో వ్యవసాయం 4.5 శాతం వృద్ధి సాధిస్తే, నాల్గవ త్రైమాసికంలో 3.1 శాతానికి పరిమితమైంది. మొత్తం ఆర్థిక సంవత్సరంలో 3.6 శాతం పురోగమించింది. జీడీపీలో వ్యవసాయ రంగం వాటా దాదాపు 15 శాతంగా ఉంది. ఈ లెక్కలను బట్టి చూస్తే భారత్‌ ఎకానమీ మళ్లీ రూ.145 లక్షల కోట్ల స్థాయిని చేరుకోవాలంటే 2021–22 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 10 నుంచి 11 శాతం పురోగమించాల్సిన అవసరముంది.

గ‌తేఏడాది సుదీర్ఘ లాక్‌డౌన్‌, క‌ఠిన నియంత్రణలతో ఆర్థిక వ్యవస్థ ఆగమైపోయింది. టూరిజం, విమాన‌యానం, వినోద‌ం, పలు రంగాలు కోలుకోలేకుండా దెబ్బతిన్నాయి. చిన్న మధ్యతరహా పరిశ్రమలు, నిర్మాణ రంగాలు ఇబ్బందుల్లో చిక్కుకున్నాయి. అయితే గ‌త ఏడాదితో పోలిస్తే ఈసారి రెండంకెల ఆర్థిక వృద్ధి రేటు న‌మోద‌వుతుంద‌నే అంచనాలు వెల్లడయ్యాయి. కానీ క‌రోనా సెకండ్ వేవ్ ఎంటరై ఆర్ధిక వ్యవస్థ రిక‌వ‌రీకి అడ్డుక‌ట్ట వేస్తుంద‌నే ఆందోళ‌న ప్రస్తుతం భయపెడుతోంది.

Tags:    

Similar News