LPG Cylinder Price: ఒకటో తేదీ భారీ షాక్.. భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర..!
Gas Cylinder: వినియోగదారుల నెత్తిన మరో బండ వేశాయి ఆయిల్ కంపెనీలు.
Gas Cylinder: వినియోగదారుల నెత్తిన మరో బండ వేశాయి ఆయిల్ కంపెనీలు. సామాన్యుడికి షాకిస్తూ.. మరోసారి సిలిండర్ ధరలను పెంచాయి. ధరల పెంపు నేటి నుంచే అమలులోకి వచ్చింది. 19 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.100కు పైగా ఎగబాకింది. అంతకుముందు ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కలిపి దాదాపు రూ.250 మేర ధర తగ్గిన విషయం తెలిసిందే. అక్టోబర్‌లో రూ.200.. తాజాగా మరో రూ.100 పెంచడంతో తగ్గింపుతో లభించిన ఉపశమనం ఆవిరైంది.
తాజా రేటు పెంపు నేపథ్యంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను గమనిస్తే.. ఢిల్లీలో సిలిండర్ రేటు రూ. 1833కు చేరింది. కోల్‌కతాలో ఈ రేటు రూ. 1943కు ఎగసింది. ముంబైలో చూస్తే.. సిలిండర్ రేటు రూ 1785కు చేరింది. ఇక చెన్నైలో ఈ రేటు రూ. 1999గా ఉంది. అయితే 14.2 కేజీల సిలిండర్ రేటు మాత్రం స్థిరంగానే ఉంది. ఈ సిలిండర్ రేటులో ఎలాంటి మార్పు లేదు. ఈ సిలిండర్ రేటు చివరిగా ఆగస్ట్ నెల 30న తగ్గింది. అటుపైన సిలిండర్ రేటు స్థిరంగానే ఉంటూ వస్తోంది.