ఖాతాదారులు అలర్ట్.. ఏటీఎం నుంచి డబ్బులు విత్ డ్రా కాకముందే సెల్‌కి మెస్సేజ్ వచ్చిందా..!
ఖాతాదారులు అలర్ట్.. ఏటీఎం నుంచి డబ్బులు విత్ డ్రా కాకముందే సెల్‌కి మెస్సేజ్ వచ్చిందా..!
ATM: నిత్య జీవితంలో చాలామంది డబ్బులు కావాలంటే ఏటీఎంలని వినియోగిస్తారు.అయితే ఒక్కోసారి నగదు తీసుకునేటప్పుడు డబ్బులు ఏటీఎంలోనే నిలిచిపోతాయనే వార్తలు మీరు వినే ఉంటారు. ఈ పరిస్థితిలో చాలా మంది ఏం చేయాలో తెలియక కంగారుపడుతుంటారు. అంతేకాదు ATM మెషిన్ నుంచి తమ డబ్బును మళ్లీ విత్‌డ్రా చేయడానికి ప్రయత్నిస్తారు. ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు నష్టపోయిన డబ్బుని ఎలా పొందాలో ఈ రోజు తెలుసుకుందాం.
RBI నిబంధనల ప్రకారం ఖాతాదారుడు తన బ్యాంక్ ATM నుంచి లేదా మరేదైనా బ్యాంకు ATM నుంచి డబ్బు విత్‌డ్రా చేసినప్పుడు నగదు బయటకు రాకపోయినా ఖాతా నుంచి డబ్బు కట్ అయినట్లు మీ సెల్‌ఫోన్‌కి మెస్సేజ్ వస్తుంది. ఇలాంటి పరిస్థితిలో మీరు సదరు బ్యాంకు శాఖని సంప్రదించండి. మీ బ్యాంకు మూసివేసి ఉంటే కస్టమర్ కేర్‌కు కాల్ చేసి లావాదేవీ గురించి తెలియజేయండి. మీ ఫిర్యాదు నమోదు అవుతుంది. మీ డబ్బు మీకు తిరిగి చెల్లించడానికి బ్యాంకు వారం రోజుల సమయం తీసుకుంటుంది.
ATM నుంచి డబ్బు విత్‌డ్రా చేస్తున్నప్పుడు ఒక్కోసారి లావాదేవీ ఫెయిల్ అయ్యే అవకాశం ఉండొచ్చు. కానీ మీరు దాని స్లిప్‌ను తప్పనిసరిగా దగ్గర ఉంచుకోవాలి. కాబట్టి స్లిప్ తీసుకోవడం మర్చిపోవద్దు. కొన్ని కారణాల వల్ల స్లిప్ రాకపోతే బ్యాంకుకు స్టేట్‌మెంట్ కూడా చూపించవచ్చు. లావాదేవీ స్లిప్ ముఖ్యమైనది ఎందుకంటే ఇది ATM ID, స్థానం, సమయం, బ్యాంక్ కోడ్‌ను ప్రింట్ చేస్తుంది.
బ్యాంక్ 7 రోజుల్లో డబ్బును వాపసు చేస్తుంది
ఇలాంటి కేసులను దృష్టిలో ఉంచుకుని ఆర్‌బీఐ ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించింది. వీటి ప్రకారం బ్యాంకు ఖాతాదారులకు 7 రోజులలోపు డబ్బును తిరిగి ఇవ్వాలి. ఒక వారంలోగా బ్యాంక్ మీ డబ్బును తిరిగి ఇవ్వకపోతే మీరు దాని కోసం బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌ను సంప్రదించవచ్చు. 7 రోజులలోపు బ్యాంకు ఖాతాదారులకు డబ్బును తిరిగి ఇవ్వలేకపోతే ఆ తర్వాత బ్యాంకు కస్టమర్‌కు రోజుకు రూ.100 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.