Two Thousand Notes: మార్కెట్లో కానరాని రూ.2000 నోట్లు.. కారణం ఏంటంటే..?

Two Thousand Notes: మార్కెట్లో కానరాని రూ.2000 నోట్లు.. కారణం ఏంటంటే..?

Update: 2022-02-23 07:16 GMT

Two Thousand Notes: మార్కెట్లో కానరాని రూ.2000 నోట్లు.. కారణం ఏంటంటే..?

Two Thousand Notes: రూ.2000 కరెన్సీ నోటు చేతిలోకొచ్చిందంటే ఆ సంబరమే వేరు. కానీ ప్రస్తుతం మార్కెట్‌లో రూ.2000 నోట్లు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. మీరు కూడా ఈ విషయాన్ని గమనించే ఉంటారు. దీని వెనుక కారణం ఏంటో తెలుసా.. వాస్తవానికి 2020, 2021 ఆర్థిక సంవత్సరాల్లో 2 వేల కొత్త నోట్లని ముద్రించలేదని ప్రభుత్వం లోక్‌సభలో వెల్లడించింది. RBI డేటా ప్రకారం 2019 లో లక్ష రూపాయల నోట్లు ముద్రిస్తే అందులో 2 వేల నోట్ల సంఖ్య 32910 ఉండేవి.

ఇది మార్చి 2021 నాటికి రూ.24510కి తగ్గింది. మొత్తం 30 లక్షల కోట్ల రూపాయల చెలామణిలో 2019లో 2 వేల నోట్ల విలువ 6 లక్షల 58 వేల కోట్లు. ఏడాది తర్వాత 2020లో అది 4 లక్షల 90 వేల కోట్లకు తగ్గింది. మార్చి 31, 2021 నాటికి దేశంలో చెలామణిలో ఉన్న మొత్తం కరెన్సీలో 2000, 500 రూపాయల నోట్లు 85 శాతం ఉన్నాయి. మిగిలిన నోట్లు 10, 20, 50, 100 రూపాయలు. 31 మార్చి 2020న ఈ సంఖ్య 83 శాతం. 2000 నోట్లతో చిన్నలావాదేవీల్లో సమస్య ఉంది.

2000తో పోలిస్తే 500, 100 రూపాయల నోట్ల చెలామణి పెరిగినట్లు తెలుస్తుంది. చిన్న చిన్న లావాదేవీల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఏటీఎంలు, బ్యాంకుల నగదు విండోల నుంచి రూ.500 నోట్లు మాత్రమే ఎక్కువగా వస్తున్నాయి. ఏటీఎంలలో క్రమంగా 2000 నోట్ల పెట్టె స్థానంలో 500 నోట్ల పెట్టెలను ఏర్పాటు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇదొక్కటే కాదు ఏటీఎంలలో నోట్లు పెట్టే కంపెనీలకు 2 వేల నోట్లు తక్కువగా ఇస్తున్నారు.

Tags:    

Similar News