Umang App: ఉమాంగ్ యాప్‌తో ఈ మొత్తం పనులు నిమిషాలలో పూర్తి..!

Umang App: ఉద్యోగులకి సామాజిక భద్రతను అందించడానికి ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పనిచేస్తుంది.

Update: 2022-08-20 08:55 GMT

Umang App: ఉమాంగ్ యాప్‌తో ఈ మొత్తం పనులు నిమిషాలలో పూర్తి..!

Umang App: ఉద్యోగులకి సామాజిక భద్రతను అందించడానికి ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పనిచేస్తుంది. ప్రతి ఉద్యోగి జీతంలో కొంత భాగాన్ని ఈపీఎఫ్‌వోలో డిపాజిట్ చేస్తారు. ఏదైనా ఖాతాదారుడు అత్యవసర పరిస్థితుల్లో లేదా రిటైర్మెంట్‌ తర్వాత ఈ డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. పీఎఫ్ ఖాతాలో ఎంత డబ్బు జమ అయిందో ఖాతాదారులు ఎప్పటికప్పుడు చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఖాతాదారు సౌలభ్యం కోసం 2017 సంవత్సరంలో ఉమంగ్ యాప్‌ను దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా ప్రావిడెంట్ ఫండ్‌లో జమ అయిన మొత్తాన్ని సులభంగా చెక్ చేసుకోవచ్చు.

ఉమంగ్ యాప్‌ను పీఎఫ్‌ ఖాతాదారులే కాకుండా సాధారణ వ్యక్తులు కూడా ఉపయోగించవచ్చు.ఈ యాప్ ద్వారా పాన్ కోసం దరఖాస్తు చేసుకోవడం, గ్యాస్ బుకింగ్, మొబైల్ బిల్లు చెల్లించడం, కరెంటు, వాటర్ బిల్లు చెల్లించడం వంటి అనేక ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు.ఇంట్లో కూర్చొని చేసుకునే వెసులుబాటు ఉంటుంది. మీరు ఈ యాప్‌లో దాదాపు 1200 కంటే ఎక్కువ ప్రభుత్వ సౌకర్యాలను పొందవచ్చు.

పీఎఫ్‌ ఖాతాదారులు ఈపీఎఫ్‌వో అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ బ్యాలెన్స్ గురించిన సమాచారాన్ని పొందవచ్చు. ఇది కాకుండా మీరు మిస్డ్ కాల్, SMS ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్‌ను తనిఖీ చేయవచ్చు. మీరు ఉమంగ్ యాప్ నుంచి పీఎఫ్‌ బ్యాలెన్స్‌ని తనిఖీ చేయాలనుకుంటే ముందుగా UAN నంబర్‌ను యాక్టివేట్ చేయవచ్చు. దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

UAN నంబర్‌ని యాక్టివేట్ చేయడం ఎలా..?

1. EPFO అధికారిక వెబ్‌సైట్‌పై క్లిక్ చేసి యాక్టివేట్ UAN ఎంపికను ఎంచుకోండి.

2. ఇక్కడ UAN నంబర్, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ మొదలైన అన్ని వివరాలను అందించండి.

3. తర్వాత మీరు గెట్ అథెంటికేషన్ పిన్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

4. తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. దాన్ని ఎంటర్ చేయండి.

5. తర్వాత మీ మొబైల్ నంబర్‌కు పాస్‌వర్డ్ వస్తుంది.

6. దీని ద్వారా మీరు మీ EPF బ్యాలెన్స్‌ను సులభంగా తెలుసుకోవచ్చు.

ఉమంగ్ యాప్‌లో EPF బ్యాలెన్స్‌ని ఎలా చెక్ చేయాలి..?

1. ఇందుకోసం ముందుగా మొబైల్‌లో UMANG యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

2. తర్వాత అందులో ఈపీఎఫ్‌ఓ ఆప్షన్‌ను ఎంచుకోండి.

3. తర్వాత ఎంప్లాయీస్ సర్వీసెస్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

4. తర్వాత వ్యూ పాస్‌పోర్ట్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

5. తర్వాత గెట్ OTPపై క్లిక్ చేయండి.

6. OTPని ఎంటర్‌ చేయండి. వెంటనే మీరు పీఎఫ్‌ బ్యాలెన్స్ సమాచారాన్ని పొందుతారు.

Tags:    

Similar News