NPS: పెన్షనర్లకి అలర్ట్‌.. ఈ నిబంధనలలో మార్పులు..!

NPS: నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS)లో నాలుగు పెద్ద మార్పులు జరిగాయి.

Update: 2022-09-22 05:42 GMT

NPS: పెన్షనర్లకి అలర్ట్‌.. ఈ నిబంధనలలో మార్పులు..!

NPS: నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS)లో నాలుగు పెద్ద మార్పులు జరిగాయి. ఇవి పెన్షనర్లపై ప్రభావం చూపుతున్నాయి. అందువల్ల ప్రతి పెన్షనర్ మారిన నిబంధనల గురించి తెలుసుకోవడం అవసరం. ఈ మార్పులన్నీ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA), ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) ద్వారా జరిగాయి. మీరు ఎన్‌పిఎస్‌లో పెట్టుబడి పెట్టి రిటైర్మెంట్‌కి దగ్గరలో ఉంటే తప్పనిసరిగా వీటి గురంచి తెలుసుకోవాలి.

1. ఈ-నామినేషన్ ప్రక్రియ

NPSలో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగుల కోసం ఈ-నామినేషన్ ప్రక్రియలో మార్పులు చేశారు. ఇప్పుడు నోడల్ అధికారి ఈ-నామినేషన్ దరఖాస్తును ఆమోదించే లేదా తిరస్కరించే హక్కును కలిగి ఉంటారు. అప్లై చేసిన 30 రోజుల్లోపు నోడల్ అధికారి ఈ-నామినేషన్‌పై నిర్ణయం తీసుకోకపోతే సెంట్రల్ రికార్డ్ కీపింగ్ సిస్టమ్ ఆమోదిస్తుంది. ఈ కొత్త నిబంధన అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తుంది.

2. యాన్యుటీ ప్లాన్

NPS మెచ్యూరిటీ సమయంలో చందాదారుడు యాన్యుటీ కోసం ప్రత్యేక ఫారమ్‌ను పూరించాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు చందాదారులు PFRDAలో నిష్క్రమణ ఫారమ్‌ను పూరించాలి. అలాగే జీవిత బీమా కంపెనీలో యాన్యుటీ ప్లాన్‌ను కొనుగోలు చేయడానికి వివరాల ప్రతిపాదన ఫారమ్‌ను నింపాల్సి ఉండేది. దీని ఆధారంగా పింఛను పొందేవారు. ఇప్పుడు ప్రపోజల్ ఫారమ్ నింపాల్సిన అవసరం ఉండదు.

3. డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్

NPS పెన్షనర్లు ఇప్పుడు ఎక్కడి నుంచైనా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించవచ్చు. దీనిని ఆధార్ ఆధారంగా ధృవీకరిస్తారు. ఈ పనిని FaceRD యాప్‌తో కూడా చేయవచ్చు. ఈ సర్టిఫికేట్ యాన్యుటీ ఇచ్చే జీవిత బీమా కంపెనీకి సమర్పించాలి. ఈ పని ఇప్పుడు ఎలక్ట్రానిక్ పద్ధతిలో పూర్తి అవుతుంది.

4. క్రెడిట్ కార్డ్ డిపాజిట్

NPS టైర్-2 ఖాతాదారులు ఇకపై క్రెడిట్ కార్డ్ ద్వారా ఖాతాలో డబ్బు జమ చేయలేరు. ఈ నియమం ఆగస్టు 3, 2022 నుంచి వర్తిస్తుంది. PFRDA క్రెడిట్ కార్డ్ చెల్లింపులను తక్షణమే ఆపివేయాలని ఆదేశించింది. దీని గురించి వినియోగదారులను హెచ్చరిస్తూ ఆగస్టు 3న సర్క్యులర్ జారీ చేసింది. కానీ NPS టైర్-1 ఖాతాలో డిపాజిట్ చేయవచ్చు.

Tags:    

Similar News