బ్యాంకు, పోస్టాఫీసు లావాదేవీల విషయంలో మార్పులు.. తెలుసుకోపోతే డబ్బుని విత్‌ డ్రా చేయలేరు..!

Money Transactions: బ్యాంకులు, పోస్టాఫీసుల లావాదేవీల నిబంధనలను ప్రభుత్వం మార్చింది.

Update: 2022-05-15 11:33 GMT

బ్యాంకు, పోస్టాఫీసు లావాదేవీల విషయంలో మార్పులు.. తెలుసుకోపోతే డబ్బుని విత్‌ డ్రా చేయలేరు..!

Money Transactions: బ్యాంకులు, పోస్టాఫీసుల లావాదేవీల నిబంధనలను ప్రభుత్వం మార్చింది. ఇప్పుడు కొత్త నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి ఏదైనా ఒక ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు లేదా పోస్టాఫీసులో రూ. 20 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేస్తే పాన్, ఆధార్ ఇవ్వడం తప్పనిసరి. ఆదాయపు పన్ను (15వ సవరణ) రూల్స్, 2022 ప్రకారం.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) కొత్త నిబంధనలను జారీ చేసింది. అ నిబంధనలు మే 26 నుంచి అమలులోకి వస్తాయి.

కొత్త నిబంధనల ప్రకారం.. ఎవరైనా బ్యాంకింగ్ కంపెనీ లేదా కార్పోరేటివ్ బ్యాంక్ లేదా పోస్టాఫీసులో ఒక ఆర్థిక సంవత్సరంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఖాతాల్లో రూ. 20 లక్షల నగదును డిపాజిట్ చేస్తే అప్పుడు అతను పాన్-ఆధార్‌ను సమర్పించాల్సి ఉంటుంది. అలాగే ఒక ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్ కంపెనీ లేదా కో-ఆపరేటివ్ బ్యాంక్ లేదా పోస్టాఫీసులో ఏదైనా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఖాతాల నుంచి రూ. 20 లక్షలు విత్‌డ్రా చేయడానికి పాన్-ఆధార్‌ను లింక్ చేయడం అవసరం.

మీరు బ్యాంకింగ్ కంపెనీ కో-ఆపరేటివ్ బ్యాంక్ లేదా పోస్టాఫీసులో కరెంట్ ఖాతా లేదా క్యాష్ క్రెడిట్ ఖాతాను ఓపెన్‌ చేసినా పాన్-ఆధార్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రజల ఆర్థిక లావాదేవీల విషయలని గమనించడానికి, అప్‌డేట్ కావడానికి ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. దీనివల్ల ఎక్కువ మంది వ్యక్తులు పన్ను పరిధిలోకి వస్తారు. అంటే పన్ను ఎగవేతకు ఇక్కడ అడ్డుకట్ట పడుతుంది. వాస్తవానికి లావాదేవీ సమయంలో పాన్ నంబర్ ఉంటే ఆదాయపు పన్ను శాఖ మిమ్మల్ని నిశితంగా పరిశీలిస్తుందని అర్థం. 

Tags:    

Similar News