FD Rates: ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీరేట్లు పెంచిన ఈ 2 బ్యాంకులు.. ఎంత పెంచాయంటే..?

FD Rates: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటు పెరిగినప్పటి నుంచి దాదాపు అన్ని బ్యాంకులు పొదుపు ఖాతా, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లని పెంచుతున్నాయి.

Update: 2022-07-02 08:59 GMT

FD Rates: ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీరేట్లు పెంచిన ఈ 2 బ్యాంకులు.. ఎంత పెంచాయంటే..?

FD Rates: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటు పెరిగినప్పటి నుంచి దాదాపు అన్ని బ్యాంకులు పొదుపు ఖాతా, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లని పెంచుతున్నాయి. తాజాగా దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన కెనరా బ్యాంక్ పొదుపు ఖాతా, ఎఫ్‌డిలపై వడ్డీ రేట్లను 5 బేసిస్ పాయింట్లు పెంచింది. ఇప్పుడు బ్యాంకు తన కస్టమర్లకు 3.55% వడ్డీ రేటును అందిస్తోంది. ఇది జూన్ 29, 2022 నుంచి అమలులోకి వచ్చింది.

అలాగే ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ కూడా తన ఎఫ్‌డి వడ్డీ రేట్లను పెంచాలని నిర్ణయించింది. పెంచిన వడ్డీరేట్లు జూలై 1, 2022 నుంచి అమలులోకి వచ్చాయి. మీకు ఈ రెండు బ్యాంకులలో ఖాతాలు ఉన్నట్లయితే ఒక్కసారి ఈ వడ్డీరేట్లని పరిశీలించండి.

కెనరా బ్యాంక్ వడ్డీ రేట్లు

50 లక్షల వరకు డిపాజిట్లు - 2.90%

రూ. 50 లక్షల నుంచి రూ. 100 కోట్ల డిపాజిట్లు - 2.90%

రూ. 100 నుంచి 300 కోట్ల డిపాజిట్లు - 3.10%

300 నుంచి 500 కోట్ల డిపాజిట్లు - 3.10%

500 నుంచి 1000 కోట్ల డిపాజిట్లు - 3.50%

1000 కోట్ల కంటే ఎక్కువ డిపాజిట్లు- 3.55%

IDFC ఫస్ట్ బ్యాంక్ FD రేట్లు-

7 నుంచి 29 రోజుల FD - 3.50%

30 నుంచి 60 రోజుల FD - 4.00%

91 నుంచి180 రోజుల FD - 4.50%

181 రోజుల నుంచి 1 సంవత్సరం వరకు FD - 5.75%

1 సంవత్సరం 1 రోజు నుంచి 3 సంవత్సరాల FD - 6.25%

3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు - 6.50% (0.25% పెరిగింది)

5 నుంచి 10 సంవత్సరాల FD - 6.00%

Tags:    

Similar News