BSNL: బీఎస్‌ఎన్‌ఎల్‌కు భారీ ప్యాకేజ్ ప్రకటించిన కేంద్రం..

BSNL: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2022-07-27 12:21 GMT

BSNL: బీఎస్‌ఎన్‌ఎల్‌కు భారీ ప్యాకేజ్ ప్రకటించిన కేంద్రం..

BSNL: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) పునరుజ్జీవం దిశగా కేంద్రం చర్యలు మొదలుపెట్టింది. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థకు రూ. 1.64 లక్షల కోట్ల పునరుద్ధరణ ప్యాకేజీ ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ ప్యాకేజీలో మూడు ప్రధాన అంశాలు ఉంటాయి.

బీఎస్ఎన్ఎల్ సేవల నాణ్యతను మెరుగుపరిచే లక్ష్యం కోసం ఈ ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. బ్యాలెన్స్ షీట్‌ను మెరుగుపరుచుకోవడంతో పాటు కంపెనీ ఫైబర్ రీచ్‌ను విస్తరించేందుకు ఈ ప్యాకేజీ ఉపయోగపడుతుందని కేందమంత్రి వైష్ణవ్ తెలిపారు. అంతేకాకుండా.. 4జీ సేవలను విస్తరించుకునేందుకు బీఎస్‌ఎన్‌ఎల్‌కు ప్రభుత్వపరంగా పూర్తి సహకారం అందించనున్నట్లు మంత్రి తెలిపారు.

Tags:    

Similar News