SSY: కూతురి పెళ్లి నాటికి రూ. 25 లక్షలు కావాలా.? నెలకు ఎంత సేవ్‌ చేయాలంటే..?

SSY: ఈ పథకంలో ఏడాదికి గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు డిపాజిట్‌ చేసుకోవచ్చు. అంటే నెలకు గరిష్టంగా రూ. 12,500 వరకు డిపాజిట్ చేయొచచు.

Update: 2024-08-13 10:20 GMT

SSY: కూతురి పెళ్లి నాటికి రూ. 25 లక్షలు కావాలా.? నెలకు ఎంత సేవ్‌ చేయాలంటే.. 

SSY: ఇంట్లో ఆడబిడ్డ ఉన్న వారు తప్పనిసరిగా వారి వివాహం గురించి లేదా పై చదువుల గురించి ఆలోచిస్తుంటారు. పెరుగుతోన్న ఖర్చుల నేపథ్యంలో వివాహానికి ఖర్చులు కూడా ఎక్కువవుతున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని పొదుపు చేస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే డబ్బును పొదుపు చేసుకునే క్రమంలో ఎన్నో రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. మీ డబ్బుకు సెక్యూరిటీతో పాటు భవిష్యత్తులో మంచి రిటర్న్స్ వచ్చే పథకాలు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. అలాంటి ఓ బెస్ట్‌ స్కీమ్‌.. సుకన్య సమృద్ధి యోజన ఒకటి. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా భారీగా రిటర్న్స్‌ పొందొచ్చు.

ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 22 జనవరి 2015న ప్రారంభించారు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా అత్యధికంగా వడ్డీ లభిస్తుంది. ఎటువంటి పన్ను లేకపోవడం ఈ స్కీమ్‌ ప్రత్యేకతగా చెప్పొచ్చు. పదేళ్లలోపు ఆడ బిడ్డల పేరు మీద సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని ప్రారంభించవచ్చు. ఒక ఇంట్లో గరిష్టంగా ఇద్దరు అమ్మాయిలు ఈ పథకంలో చేరొచ్చు.

ఈ పథకంలో ఏడాదికి గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు డిపాజిట్‌ చేసుకోవచ్చు. అంటే నెలకు గరిష్టంగా రూ. 12,500 వరకు డిపాజిట్ చేయొచచు. ఉదాహరణకు మీ కూతురి వివాహం సమయానికి మీకు రూ. 25 లక్షలు కావాలంటే నెలకు రూ. 5 వేలు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అకౌంట్‌ ఓపెన్‌ చేసిన తర్వాత 15 ఏళ్ల పాటు డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అనంతరం మరో 6 ఏళ్లు ఆగాల్సి ఉంటుంది. 21 ఏళ్ల తర్వాత పూర్తి డబ్బులు వస్తాయి. ఒకవేళ అమ్మాయికి 18 ఏళ్లు వచ్చిన తర్వాత కొంత డబ్బులు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది.

ప్రస్తుతం సుకన్య సమృద్ధి యోజన పథకంపై 7.6 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. ఈ వడ్డీ రేటు ఎప్పటికీ ఒకేలా ఉండదు. ప్రతి మూడు నెలలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేట్లను సమీక్షిస్తూ ఉంటుందన్నారు. అందువల్ల వడ్డీ రేట్లు పెరగొచ్చు. లేదంటే తగ్గొచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. 

Tags:    

Similar News