Post Office: నెలకు రూ. 500 ఇన్వెస్ట్ చేస్తే.. రూ. 3 లక్షలు పొందొచ్చు.. సూపర్ స్కీమ్..!
Post Office: భవిష్యత్తు అవసరాల దృష్ట్యా డబ్బు పొదుపు చేయడం అనేది సర్వసాధారణమైన విషయం.
Post Office: భవిష్యత్తు అవసరాల దృష్ట్యా డబ్బు పొదుపు చేయడం అనేది సర్వసాధారణమైన విషయం. వారి వారి ఆదాయాలకు అనుగుణంగా డబ్బు పొదుపు చేస్తుంటారు. అయితే డబ్బు పొదుపు చేసుకోవడంలో ఎన్నో మార్గాలు ఉంటాయి. కష్టపడి సంపాదించిన డబ్బును జాగ్రత్తగా దాచుకోవాలని కోరుకుంటారు. అయితే ఈ క్రమంలో డబ్బుకు సెక్యూరిటీతో పాటు మంచి రిటర్న్స్ రావాలని ప్రతీ ఒక్కరూ ఆశిస్తుంటారు.
ఇందుకోసం ఎన్నో రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. భారత ప్రభుత్వ రంగ సంస్థ పోస్టాఫీస్ ఎన్నో రకాల పథకాలను అందిస్తోంది. ఈ పథకాల ద్వారా మీ డబ్బుకు సెక్యూరిటీతోపాటు మంచి రిటర్న్స్ అందేలా పలు పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇలాంటి బెస్ట్ పథకాల్లో సుకన్య సమృద్ధి యోజన ఒకటి. బాలికల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తీసుకొచ్చిన ఈ పథకం ద్వారా మంచి రిటర్న్స్ పొందొచ్చు. బాలికల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఆడ బిడ్డల కోసం తీసుకొచ్చిన సుకన్య సమృద్ధి యోజన పథకంలో ప్రతీ ఏటా కనీసం రూ. 250 నుంచి గరిష్టంగా రూ. 1.15 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన వారికి 8.2 శాతం వడ్డీ లభిస్తోంది. ఈ పథకంలో 15 ఏళ్లపాటు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుది. 21 ఏళ్ల తర్వాత ఈ పథకం మెచ్యూరిటీ అవుతుంది. తక్కువ మొత్తంలో పెట్టుబడి పెడుతూ వెళ్తే కుమార్తె వివాహ సమయానికి లేదా, పై చదువుల కోసం మంచి మొత్తంలో రిటర్న్స్ పొందొచ్చు.
ఉదాహరణకు ఈ పథకంలో మీరు నెలకు రూ. 500 పెట్టుబడి పెడితే ఎంత వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ప్రతీ నెల రూ. 500 పెట్టుబడి పెట్టారనుకుందాం. దీంతో మీరు ఏటా రూ. 6000 ఇన్వెస్ట్ చేస్తారు. ఇలా 15 ఏళ్లు పెట్టుబడి పెట్టారనుకుందాం. దీంతో మీరు 15 ఏళ్లలో మొత్తం రూ. 90,000 ఇన్వెస్ట్ చేస్తారు. ఈ పెట్టుబడికి 8.2 శాతం వడ్డీ లభిస్తే.. 21 ఏళ్ల తర్వాత రూ. 2,77,103 పొందొచ్చు.