Post Office: నెలకు రూ.500 పొదుపు చేస్తే.. రూ. 4 లక్షలు పొందొచ్చు..!
Post Office: సంపాదించే దాంట్లో ఎంతో కొంత పొదుపు చేసుకోవడం సర్వసాధారణమైన విషయం.
Post Office: సంపాదించే దాంట్లో ఎంతో కొంత పొదుపు చేసుకోవడం సర్వసాధారణమైన విషయం. ప్రతీ ఒక్కరూ తాము సంపాదించిన దాంట్లో ఎంతో కొత్త పొదుపు చేసుకుంటారు. భవిష్యత్తులో వచ్చే ఆర్థికపరమైన అవసరాల దృష్ట్యా పొదుపు అనివార్యంగా మారింది. అందుకే ఉద్యోగంలో చేరిన తొలిరోజు నుంచే పొదుపు చేయడం ప్రారంభిస్తున్నారు.
అయితే పెట్టుబడి పెట్టే విషయంలో ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పెట్టిన పెట్టుబడికి రక్షణ ఉంటూనే మంచి రిటర్న్స్ రావాలని ఆశిస్తుంటారు. అలాంటి వారికోసమే ఇండియన్ పోస్టాఫీస్ మంచి పథకాలను అమలు చేస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలను టార్గెట్ చేస్తూ పోస్టాఫీస్‌లో మంచి పథకాలను తీసుకొస్తున్నారు. ఇందులో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లేదా పీపీఎఫ్. ఈ పథకంలో నెలకు కేవలం రూ. 500 డిపాజిట్ చేసి, రూ. 4 లక్షలు ఎలా పొందొచ్చొ ఇప్పుడు తెలుసుకుందాం.
పోస్టాఫీస్ అందిస్తున్న బెస్ట్ పథకాల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అంటే పీపీఎఫ్ ఒకటి. ఇది ఒక దీర్ఘకాలిక పథకం. ఈ పథకంలో సంవత్సరానికి కనిష్టంగా రూ. 500, గరిష్టంగా రూ. 1.5 లక్షలు డిపాజిట్ చేయవచ్చు. ఇలా దాదాపు 15 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టవచ్చు. మీకు కావాలంటే, మెచ్యూరిటీ తర్వాత, మీరు 5 సంవత్సరాల బ్లాక్‌లో ఖాతాను పొడిగించవచ్చు. మీరు ఈ పథకంలో ప్రతి నెలా రూ. 500 ఇన్వెస్ట్ చేస్తూ పోతుంటే.. ఏటా రూ. 6000 వరకు పెట్టుబడి పెట్టొచ్చు. ప్రస్తుతం ఈ పథకంలో 7.1 శాతం వడ్డీ ఇస్తోంది. అటువంటి పరిస్థితిలో, ఈ పథకంలో ప్రతి నెలా రూ. 500 డిపాజిట్ చేయడం ద్వారా, మీరు 7.1 శాతం వడ్డీతో 15 సంవత్సరాలలో రూ. 1,62,728 జోడించవచ్చు. 5.5 ఏళ్లు పొడిగిస్తే 20 ఏళ్లలో రూ.2,66,332, 25 ఏళ్లలో రూ.4,12,321 జోడించవచ్చు.