Second Hand Car: సెకండ్‌ హ్యాండ్‌ సీఎన్‌జీ కారుని కొంటున్నారా.. ఈ విషయాలని మరిచిపోకండి..!

Second Hand Car: పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల వల్ల చాలామంది సీఎన్‌జీ వైపు దృష్టి సారిస్తున్నారు...

Update: 2022-05-17 06:59 GMT

Second Hand Car: సెకండ్‌ హ్యాండ్‌ సీఎన్‌జీ కారుని కొంటున్నారా.. ఈ విషయాలని మరిచిపోకండి..!

Second Hand Car: పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల వల్ల చాలామంది సీఎన్‌జీ వైపు దృష్టి సారిస్తున్నారు. గత కొన్ని రోజులుగా సీఎన్‌జీ వాహనాలకు డిమాండ్ బాగా పెరిగింది. ఈ పరిస్థితిలో కొత్త కార్లు కొనుగోలు చేసే చాలామంది సీఎన్‌జీ కార్లను కొనుగోలు చేస్తున్నారు. కానీ సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేసే వారు బయటి నుంచి సీఎన్‌జీ బిగించుకుంటున్నారు. ఇది వారి కారుకి హానికరం. ఈ పరిస్థితిలో సెకండ్ హ్యాండ్ సిఎన్‌జి కార్లను కొనుగోలు చేసే వారు ఏ విషయాలను గుర్తుంచుకోవాలో తెలుసుకుందాం.

ఈ రోజుల్లో సెకండ్ హ్యాండ్ CNG కారు కొనాలని ప్లాన్ చేస్తున్నా లేదా ఉపయోగించిన CNG కారును నడుపుతున్నట్లయితే మీరు కొన్ని విషయాలపై శ్రద్ధ వహించాలి. మొదటి విషయం ఏంటంటే కంపెనీ అమర్చిన CNG కారును కొనుగోలు చేయాడానికి మొగ్గు చూపాలి. ఎందుకంటే కంపెనీలు తమ సిఎన్‌జి కార్ల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తాయి. ఇంజన్ ఆరోగ్యం కూడా బాగుండే విధంగా, ప్రజలకు మంచి మైలేజీతో పాటు భద్రతను పొందే విధంగా ఇంజిన్‌తో కలిసి చక్కగా ట్యూన్ చేస్తారు.

మీరు సెకండ్ హ్యాండ్ CNG కారును కొనుగోలు చేసి ఉంటే లేదా ఇప్పటికే ఉపయోగించిన CNG కారును ఉపయోగిస్తుంటే మీరు CNG కిట్‌ను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఉండాలి. ఎక్కడి నుంచి గ్యాస్ లీక్ అవ్వకుండా సిలిండర్ నాణ్యతలో రాజీ పడకుండా ఉండాలి. గత కొన్ని సంవత్సరాలుగా కారు CNG కిట్‌లో పేలుడు సంభవించినట్లు అనేక సంఘటనలు తెరపైకి వచ్చాయి. గ్యాస్ రీఫ్యూయలింగ్ సమయంలో చాలా పేలుళ్లు జరుగుతాయి. అందుకే సిలిండర్ నింపుతున్నప్పుడు కారులో ఉన్న వారందరిని దిగమని చెప్పడం మంచిది.

Tags:    

Similar News