Car Prices: కొత్త సంవత్సరం కారు కొనడం చాలా ఖరీదు.. ధరలు పెంచుతున్న కంపెనీలు

Car Prices: కారు కొనాలనుకునేవారికి ఇది బ్యాడ్‌ న్యూస్‌ అనే చెప్పాలి. ఎందుకంటే కొత్త సంవత్సరంలో కార్ల ధరలు విపరీతంగా పెరగనున్నాయి.

Update: 2022-01-04 10:52 GMT

Car Prices: కొత్త సంవత్సరం కారు కొనడం చాలా ఖరీదు.. ధరలు పెంచుతున్న కంపెనీలు

Car Prices: కారు కొనాలనుకునేవారికి ఇది బ్యాడ్‌ న్యూస్‌ అనే చెప్పాలి. ఎందుకంటే కొత్త సంవత్సరంలో కార్ల ధరలు విపరీతంగా పెరగనున్నాయి. ముడిసరుకు ధరల పెరుగుదల కారణంగా అనేక ప్రధాన కార్ల కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. కొత్త ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మారుతీ సుజుకీ కార్ల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలన్ని మారుతీ అరేనా, నెక్సా మోడళ్లపై వర్తిస్తాయి. మారుతీ ఇంకా మోడల్ వారీగా ధరల పెంపును ప్రకటించలేదు. 2021లోనే మారుతి తన మోడల్స్ ధరలను 3 సార్లు పెంచింది. మొదటిసారి జనవరిలో, రెండోసారి ఏప్రిల్‌లో, మూడోసారి సెప్టెంబర్‌లో పెంచింది.

టాటా మోటార్స్ తమ ప్యాసింజర్ వాహనాలు, వాణిజ్య వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరుగుతున్న ముడిసరుకు ధరల ప్రభావాన్ని తగ్గించేందుకు జనవలో అన్ని ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచనున్నట్టు కంపెనీ తెలిపింది. వాణిజ్య వాహనాల విక్రయాలు 2.5 శాతం పెరగనున్నప్పటికీ ధరల పెంపుపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అదేవిధంగావోక్స్‌వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ ఇండియా జనవరి 1, 2022 నుంచి పోలో, వెంటో, టైగన్ ధరలను పెంచింది. కారు మోడల్ వేరియంట్ ఆధారంగా ధర పెంపు 2-5 శాతం మధ్య ఉంటుంది.

వాహన తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) ముడిసరుకు ధరల పెరుగుదల ప్రభావాన్ని తగ్గించడానికి జనవరి 1, 2022 నుంచి తన అన్ని వాహనాల ధరలను పెంచినట్లు ప్రకటించింది. టయోటా భారత మార్కెట్లో గ్లాంజా, అర్బన్ క్రూసేడర్, ఇన్నోవా క్రిస్టా, ఫార్చ్యూనర్ వంటి వాహనాలను విక్రయిస్తోంది. ముడిసరుకుతో సహా ఇన్‌పుట్ ధర నిరంతరం పెరుగుతుండడంతో వాహనాల ధరలను మార్చాల్సిన అవసరం ఏర్పడిందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. మా కస్టమర్‌లపై వ్యయ పెరుగుదల ప్రభావం తగ్గించడానికి మేము అన్ని ప్రయత్నాలు చేస్తామని తెలిపింది. ఆడి తన మొత్తం మోడల్ పోర్ట్‌ఫోలియోలో ధరను 3% పెంచింది. 

Tags:    

Similar News