Business Idea: జస్ట్ రూ.5 వేలు పెట్టుబడి పెడితే చాలు మీకు ఒక్క రోజులోనే రూ. 20 వేలు లాభం..
Business Idea: మీరు బిజినెస్ కోసం పెట్టుబడి సిద్ధంగా చేసుకొని ప్లాన్ కోసం ఎదురు చూస్తున్నారా.. అయితే అతి తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయం లభించే బిజినెస్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఈ బిజినెస్ చేయడం ద్వారా మీరు చాలా తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ ఆదాయం లభిస్తుంది. అలాంటి బిజినెస్ ఏంటో తెలుసుకుందాం.
Business Idea అతి తక్కువ పెట్టుబడికి మంచి రాబడి లభించే బిజినెస్ కోసం చూస్తున్నారా.. అయితే ప్రస్తుతం ఒక బిజినెస్ ప్లాన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ బిజినెస్ చేయడం ద్వారా మీకు అతి తక్కువ పెట్టుబడి తోనే మంచి ఆదాయం లభించే అవకాశం ఉంటుంది. దీనికోసం మీరు రోజుకు రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు పనిచేస్తే సరిపోతుంది. పైగా ఏ రోజుకు ఆరోజు ఆదాయం మీకు లభిస్తుంది. అలాంటి బిజినెస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ బిజినెస్ కు పెళ్లిళ్ల సీజన్లో మంచి డిమాండ్ ఉంటుంది. ఇది ఏ బిజినెస్ అని మీరు ఆలోచిస్తున్నారా...అయితే ఫ్లవర్ డెకరేషన్ బిజినెస్ ఒక చక్కటి ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈ బిజినెస్ కు పెళ్లిళ్లతో పాటు ఇతర ఫంక్షన్లకు కూడా మంచి డిమాండ్ ఉంటుంది. ఫ్లవర్ డెకరేషన్ అనేది ఈ మధ్యకాలంలో ప్రతి పెళ్లిలోనూ తప్పనిసరి అయింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మీరు ఈ బిజినెస్ ప్లాన్ చేసుకుంటే, ప్రతినెల మంచి బిజినెస్ అందుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్లో మీకు చేతినిండా పని లభిస్తుంది.
ఫ్లవర్ డెకరేషన్ బిజినెస్ కోసం మీకు కావాల్సింది డెకరేషన్ చేయడానికి కొద్ది మంది వ్యక్తుల సహకారం. అలాగే మీరు కూడా స్వతహాగా ఫ్లవర్ డెకరేషన్ పట్ల ఆసక్తి కలిగి ఉండి, డెకరేషన్ చేసేందుకు ప్రయత్నం చేయాలి నెమ్మదిగా ప్రయత్నం చేస్తే ఈ డెకరేషన్ మీరు నేర్చుకోవచ్చు. అనంతరం మీరు సొంతంగా బిజినెస్ ప్రారంభించినట్లయితే, చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఇందులో పెట్టుబడి కూడా చాలా తక్కువగా ఉంటుంది.
ఉదాహరణకు మీకు మెటీరియల్ కాస్ట్ మొత్తం కలిపి ఒక 5 వేల రూపాయల వరకు ఖర్చు అయితే, మీరు ఒక్కో డిజైన్ కు దాదాపు 15 వేల రూపాయల నుంచి 25 వేల రూపాయల వరకు డబ్బులు వసూలు చేసుకోవచ్చు. ఫ్లవర్ డెకరేషన్ తో పాటు బెలూన్ డెకరేషన్ అదేవిధంగా కలర్ పేపర్స్ డెకరేషన్ అకేషన్ కి తగ్గట్టుగా వివిధ రకాల డిజైన్లను డెకరేట్ చేసే డిజైన్లను మీరు ముందుగానే ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది.
మెటీరియల్ మీరు హోల్సేల్ మార్కెట్లో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీరు పువ్వులను హోల్సేల్ మార్కెట్ లోనే ముందుగానే కొనుగోలు చేసుకుని ఫ్రెష్ ఫ్లవర్స్ తో మీరు డిజైన్లను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక మీ బిజినెస్ ను పబ్లిసిటీ చేసుకునేందుకు ముఖ్యంగా సోషల్ మీడియాను వాడుకుంటే బెస్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో ప్రమోట్ చేసుకున్న బిజినెస్ లు అన్నీ కూడా సక్సెస్ అవుతున్నాయి. ఉదాహరణకు మీరు మంచి ఫ్లవర్ డెకరేషన్ చేసినా అనంతరం దాన్ని ఫోటో తీసి ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్ లో కానీ పోస్ట్ చేసినట్లయితే మీకు ఆర్డర్లు సులభంగా లభిస్తాయి.
మీరు తీసిన ప్రతి డిజైన్ ను instagram పేజ్ లో పోస్ట్ చేసినట్లయితే, మీకు సులభంగా ఆర్డర్లు లభిస్తా.యి తద్వారా మీకు దాదాపు 365 రోజులు పని లభించే అవకాశం ఉంటుంది. పెళ్లిళ్ల సీజన్ లేనప్పుడు మీకు బర్త్ డే డెకరేషన్లు ఇతర ఫంక్షన్ల డెకరేషన్ కూడా లభిస్తాయి. అలాగే కాలేజీ ఫంక్షన్లు రాజకీయ పార్టీల సభలు ఇలా అకేషన్ ఏదైనా డెకరేషన్ లేకుండా ఉండదన్న సంగతి గుర్తుంచుకోండి. మీరు తీసుకున్న ఆర్డర్ ను బట్టి టీం తయారు చేసుకొని చక చక పనులు చేస్తే సరిపోతుంది.