కాసేపట్లో 2021-22 బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల బాటపట్టాయి. సెన్సెక్స్ 450 పాయింట్లు లాభపడి 46వేల553 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 120 పాయింట్ల లాభంతో 13వేల702 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 73.03 వద్ద కొనసాగుతోంది. బడ్జెట్‌పై మదుపర్ల అంచనాలను బట్టి సూచీల్లో ఒడుదొడుకులు కనిపించవచ్చని అభిప్రాయపడుతున్నారు.