BSNL: ఇప్పట్లో టారిఫ్లు పెంచేది లేదు
BSNL: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఇప్పట్లో టారఫ్ ఛార్జీలు పెంచే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే టెలికాం దిగ్గజాలు జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియాలు టారిఫ్ ఛార్జీలను 30శాతం పెంచిన సంగతి తెలిసిందే.
BSNL: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఇప్పట్లో టారఫ్ ఛార్జీలు పెంచే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే టెలికాం దిగ్గజాలు జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియాలు టారిఫ్ ఛార్జీలను 30శాతం పెంచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బిఎస్ఎన్ఎల్ స్పందించింది.
ఈ అంశంపై బీఎస్ఎన్ఎల్ సీఎండీ రాబర్ట్ రవి మాట్లాడారు. సమీప భవిష్యత్తులో టారిఫ్ ఛార్జీలను పెంచాలనుకోవడం లేదని..ప్రస్తుతం కస్టమర్ల సంతోషాన్ని, వారి విశ్వాసాన్ని గెలుచుకునేందుకు ప్రయత్నాలను వేగవంతం చేసినట్లు తెలిపారు.
కంపెనీకి చెందిన కొత్త లోగోను టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. వచ్చే ఏడాది లక్ష 4జీ సైట్లను నెలకొల్పాలనుకుంటున్నట్లు..భవిష్యత్తులో 5జీగా మారనున్నాయని తెలిపారు.
స్పామ్ రహిత నెట్ వర్క్ ను అందించేందుకుగాను సంస్థ కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలిపారు. మోసపూరిత ఎస్ఎంఎస్ లు, కాల్స్ ను ముందుగా గుర్తించి ఆటోమెటిగ్గా వాటిని బ్లాక్ చేస్తుంది.
ఇక ఫైబర్ ఆధారిత ఇంటర్నెట్ లైవ్ టీవీ సర్వీసులను కూడా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తుంది. దీంతో ఎఫ్ టీటీహెచ్ యూజర్లకు 500 వరకు ప్రీమియం ఛానెల్స్ ను అందించనుంది. ఏ సమయంలోనైన్ సిమ్ ల కోసం ప్రత్యేక కియోస్క్ కేంద్రాలను నెలకొల్పుతుంది. ఈ కేంద్రాల్లో సిమ్ యాక్టివేషన్, కేవైసీ ఇంటిగ్రేషన్ చేసుకోవచ్చు.