గ్యాస్ వినియోగదారులకి గుడ్‌న్యూస్.. చౌకగా ఎలా పొందాలో తెలుసుకోండి..!
*గ్యాస్ వినియోగదారులకి గుడ్‌న్యూస్.. చౌకగా ఎలా పొందాలో తెలుసుకోండి..!
Gas Cylinder: గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేయాలనుకునేవారికి ఓ శుభవార్త ఉంది. పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరల మధ్య రూ. 1000కే ఎల్‌పిజి సిలిండర్‌ను పొందే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రభుత్వ చమురు కంపెనీలు సమాచారం ఇచ్చాయి. 1000 రూపాయలకు గ్యాస్ సిలిండర్‌ను చౌకగా ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకుందాం.
ఎలా బుక్ చేయాలి
మీరు ప్రభుత్వ చమురు కంపెనీల కస్టమర్ కేర్‌కు కాల్ చేయడం వల్ల మీ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. ఇది కాకుండా మీరు సిలిండర్‌ను ఆన్‌లైన్‌లో కూడా బుక్ చేసుకునే సదుపాయం ఉంది. మీ దగ్గర పేటీఎం యాప్ ఉంటే దాని ద్వారా గ్యాస్ సిలిండర్లను చౌకగా బుక్ చేసుకోవచ్చు. దీనివల్ల పెద్ద ప్రయోజనాన్ని పొందుతారు. దాదాపు రూ. 1000 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.
ఈ ప్రోమోకోడ్‌ని ఉపయోగించండి
ప్రస్తుతం మీరు పేటీఎంలో 4 క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ల ప్రయోజనాన్ని పొందవచ్చు. ఇందులో మీరు రూ. 5 నుంచి రూ. 1000 వరకు క్యాష్‌బ్యాక్ పొందుతారు. దీని కోసం GAS1000 ప్రోమో కోడ్‌ను ఉపయోగించవచ్చు. ఇందులో కస్టమర్లు గరిష్టంగా రూ. 1000 కనిష్టంగా రూ. 5 క్యాష్‌బ్యాక్ పొందుతారు.
ఇలా బుకింగ్ చేయండి
1. ముందుగా Paytm యాప్‌కి వెళ్లాలి.
2. తర్వాత బుక్ గ్యాస్ సిలిండర్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
3. తర్వాత గ్యాస్ ప్రొవైడర్‌ను ఎంచుకోవాలి.
4. మీరు Bharatgas, HP Gas, Indane మీ ప్రొవైడర్ ఏదైనా ఎంచుకోవచ్చు.
5. ఇప్పుడు మీరు LPG ID లేదా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.
6. ఇప్పుడు ప్రొసీడ్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
7. ఇప్పుడు అప్లై ప్రోమోకోడ్‌పై క్లిక్ చేయాలి.
8. ఇక్కడ మీరు మీ సొంత ప్రకారం ఆఫర్‌ల ప్రయోజనాన్ని పొందవచ్చు.
9. ప్రోమోకోడ్‌ను నమోదు చేసిన తర్వాత చెల్లింపు చేయాలి. క్యాష్‌బ్యాక్ అందుతుంది.