Alert:ఖాతాదారులకి అలర్ట్.. ఏ మాత్రం పొరపాటు చేసినా అకౌంట్ ఖాళీ..!
Alert:ఖాతాదారులకి అలర్ట్.. ఏ మాత్రం పొరపాటు చేసినా అకౌంట్ ఖాళీ..!
Alert: టెక్నాలజీ పెరగడంతో ఈ రోజుల్లో ఆన్‌లైన్ లావాదేవీలు విపరీతంగా పెరిగాయి. క్షణాల్లో పనులు జరిగిపోతున్నాయి. అదే విధంగా సైబర్ మోసాలు కూడా జోరందుకున్నాయి. నేరగాళ్లు అమాయకులని టార్గెట్ చేసి అందిన కాడికి దోచుకుంటున్నారు. ఖాతాదారులకి తెలియకుండా అకౌంట్లో ఉన్న డబ్బు మొత్తం లూటీ చేస్తున్నారు. అందుకే వివిధ బ్యాంకులు ఫేక్ మెస్సేజ్‌ల గురించి వినియోగదారులని పదే పదే హెచ్చరిస్తున్నాయి.
ఇటీవల ఎస్ బిఐ కస్టమర్లకు ఫేక్ మెసేజ్‌లు పెరుగుతున్నాయి. ఇవి ఎలా ఉంటున్నాయంటే 'మీ బ్యాంక్ ఖాతా బ్లాక్ చేయబడింద'ని అంటూ ఎస్ఎంఎస్ వస్తుంది. వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలని.. ఎస్‌బిఐ ఖాతాదారులను హెచ్చరిస్తూనే ఉంది. ఈ మెసేజ్‌లను మోసగాళ్లు పంపుతున్నారు. ఇలాంటి సందేశాలు వస్తే స్పందించవద్దు. వారు పంపే నకిలీ లింక్ లపై క్లిక్ చేయవద్దని బ్యాంక్ ప్రజలను హెచ్చరిస్తోంది. ఒకవేళ బ్యాంక్ ఖాతా లాక్ అయిందంటూ మోసగాళ్లు నకిలీ కాల్స్ చేసినా స్పందించవద్దు. మీరు మీ ఆధార్, పాన్ వివరాలను ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదు. ఈ మెయిల్ లోనూ ఇలాంటి మేసేజ్ లు వస్తాయి జాగ్రత్త..
ఫేక్ మెసేజ్‌లో ఎస్బిఐ ఖాతాదారులకు 'డియర్ అకౌంట్ హోల్డర్, ఎస్బిఐ బ్యాంక్ డాక్యుమెంట్ గడువు ముగిసింది. ఖాతా ఇప్పుడు బ్లాక్ చేయబడుతుంది. ఈ లింక్‌పై క్లిక్ చేసి నెట్‌బ్యాంకింగ్ ద్వారా అప్‌డేట్ చేసుకోండి' మెసేజ్ చూస్తుంటే ఎస్ బీఐ నుంచి రాలేదని తెలుస్తోంది. సందేశంలో గ్రామర్ తప్పులు ఉండటమే కాకుండా, ఫార్మాట్ కూడా గందరగోళంగా కనిపిస్తుంది. వచ్చిన లింక్ కూడా ఎస్బిఐ అధికారిక వెబ్‌సైట్ నుంచి కాదని గుర్తు పెట్టుకోండి. బ్యాంకు ఇలాంటి మెస్సేజ్‌లు పంపించదు.