Saving schemes: బ్యాంక్‌ ఎఫ్డీ కంటే ఎక్కువ వడ్డీ కావాలా.? ఇవే బెస్ట్ ఆప్షన్స్‌..

Best saving schemes in Post Office: బ్యాంకుల కంటే ఎక్కువగా వడ్డీ వచ్చే పథకాలు కూడా అంబాటులో ఉన్నాయి. పోస్టాఫీస్‌ అందిస్తున్న అలాంటి కొన్ని బెస్ట్‌ స్కీమ్స్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Update: 2024-07-24 15:05 GMT

Saving schemes: బ్యాంక్‌ ఎఫ్డీ కంటే ఎక్కువ వడ్డీ కావాలా.? ఇవే బెస్ట్ ఆప్షన్స్‌..

సంపాదించిన డబ్బును ఎక్కడో ఒక చోట పెట్టుబడిగా పెట్టాలి. లేదా వడ్డీ వచ్చే పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలి. ఇది అందరికీ తెలిసిందే. అయితే కష్టపడి సంపాదించిన డబ్బుకు సెక్యూరిటీతో పాటు మంచి వడ్డీ రావాలని ప్రతీ ఒక్కరూ ఆశిస్తుంటారు. సాధారణంగా స్టాక్‌ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ ఆదాయం వస్తుంది కానీ, రిస్క్‌ ఎక్కువగా ఉంటుంది. దీంతో చాలా మంది బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్స్‌ చేస్తుంటారు. అయితే బ్యాంకుల కంటే ఎక్కువగా వడ్డీ వచ్చే పథకాలు కూడా అంబాటులో ఉన్నాయి. పోస్టాఫీస్‌ అందిస్తున్న అలాంటి కొన్ని బెస్ట్‌ స్కీమ్స్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్:

మీ డబ్బుకు సెక్యూరిటీతో పాటు మంచి వడ్డీ పొందడానికి బెస్ట్‌ ఆప్షన్స్‌లో నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికేట్‌ ఒకటి. ఈ పథకంలో పెట్టిన పెట్టుబడికి 7.7 శాతం వడ్డీ లభిస్తుంది. అయితే మెచ్యూరిటీ తర్వాత వడ్డీ మొత్తం అందుతుంది. సింగిల్‌ ఖాతాతో పాటు ముగ్గురు కలిసి కూడా ఉమ్మడి ఖాతాను ఓపెన్‌ చేసుకోవచ్చు. ఈ పథకంలో కనిష్టంగా రూ. 1000 నుంచి గరిష్టంగా ఎంతైనా పెట్టుబడి పెట్టొచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం వలన 80C కింద పన్ను మినహాయింపు కూడా పొందొచ్చు.

పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్..

ప్రతీ నెల స్థిరంగా ఆదాయం పొందాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఇందులో కనీసం రూ. 1500 నుంచి గరిష్టంగా రూ. 9 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. అదే జాయింట్ అకౌంట్‌లో అయితే రూ. 15 లక్షలు పెట్టుబడి పెట్టొచ్చు. ఇందులో పెట్టుబడి పెట్టిన వారికి ప్రతీ నెల పెట్టుబడిపై 7.4 శాతం వడ్డీ పొందొచ్చు. ఇక ఈ పథకంలో పెట్టుబడిదారుడికి 80C కింద పన్ను మినహాయింపు లభించదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

కిసాన్ వికాస్ పత్ర..

ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి వడ్డీ పొందొచ్చు. స్థిర వడ్డీరేటు, హామీతో కూడిన రాబడి అందిస్తుంది. అయితే ఈ పథకంలో పన్ను ప్రయోజనం ఉండదు. ఈ పథకంలో పెట్టుబడిదారులు సంవత్సరానికి 7.5 శాతం చక్రవడ్డీని పొందుతారు. పెట్టుబడి మొత్తం 115 నెలలు లేదా 9 సంవత్సరాల 7 నెలల్లో రెట్టింపు అవుతుంది. ఈ పథకంలో కనీస పెట్టుబడి రూ. 1000, గరిష్ట పెట్టుబడిపై ఎలాంటి లిమిట్ లేదు.

Tags:    

Similar News