ఐదేళ్లలో రూ. 10 లక్షలు జమ చేయాలా.? పోస్టాఫీస్‌ నుంచి బెస్ట్ స్కీమ్‌..!

Post office: మారుతోన్న ఆర్థిక అవసరాల దృష్ట్యా చాలా మంది డబ్బును ఆదాయం చేస్తున్నారు. ఉద్యోగంలో చేరిన తొలిరోజు నుంచే ఏదో ఒక పథకంలో పెట్టుబడి పెడుతున్నారు.

Update: 2024-06-23 02:30 GMT

ఐదేళ్లలో రూ. 10 లక్షలు జమ చేయాలా.? పోస్టాఫీస్‌ నుంచి బెస్ట్ స్కీమ్‌

Post office: మారుతోన్న ఆర్థిక అవసరాల దృష్ట్యా చాలా మంది డబ్బును ఆదాయం చేస్తున్నారు. ఉద్యోగంలో చేరిన తొలిరోజు నుంచే ఏదో ఒక పథకంలో పెట్టుబడి పెడుతున్నారు. తాము సంపాదిస్తున్న దాంట్లో ఎంతో కొంత పొదుపు చేయడాన్ని అలవాటుగా మార్చుకుంటున్నారు. ఇక ఇలాంటి పథకాలను అందించడంలో పోస్టాఫీస్ ముందు వరుసలో ఉంది. మీ డబ్బుకు ఎలాంటి రిస్క్‌ లేకుండా మంచి లాభాలు ఆర్జించేందుకు వీలుగా పలు పథకాలను తీసుకొచ్చారు. అలాంటి బెస్ట్‌ స్కీమ్స్‌లో నేషనల్‌ సేవింగ్స్‌ రికరింగ్‌ డిపాజిట్‌ అకౌంట్‌ (ఆర్‌డీ) ఒకటి. ఇంతకీ ఈ పథకం ఏంటి.? ఇందులో ఎంత పెట్టుబడి పెడితే, ఎంత లాభం వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

పోస్టాఫీస్ అందిస్తున్న ఈ పథకానికి కేవలం ఐదేళ్ల మెచ్యూరిటీ వ్యవధి మాత్రమే ఉంటుంది. మీరు నెలకు కొంత పొదుపు చేస్తారన్నదానిపై మీ రిటర్న్స్‌ ఆధారపడి ఉంటాయి. ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన వారు రుణం కూడా పొందొచ్చు. అంతేకాదు అకౌంట్‌ను ముందుగా కూడా క్లోజ్‌ చేసుకోవచ్చు. ఈ పథకంలో రూ. 5,000, రూ. 10,000, రూ. 15,000, రూ. 20,000 చొప్పున నెల నెల జమ చేసుకుంటూ వెళ్లొచ్చు. ఆర్‌డీ పథకం త్రైమాసికానికి కలిపి 6.7 శాతం వార్షిక వడ్డీని అందిస్తుంది. ఖాతాలో కనీస పెట్టుబడి రూ. 100 నుంచి రూ.10 గుణిజాలలో, గరిష్ట డిపాజిట్లకు పరిమితి ఉంటుంది.

ఒకవేళ ఒక నెలలో డిపాజిట్ చేయకపోతే రూ.100 డినామినేషన్ ఖాతాకు రూ.1 రుసుము విధిస్తారు. నాలుగు సాధారణ డిఫాల్ట్‌ల తర్వాత, ఖాతాను నిలిపివేయవచ్చు. రెండు నెలల్లోపు పునరుద్ధరించవచ్చు. ఉదాహరణకు మీరు నెలకు రూ. వేలు జమ చేసుకుంటూ వెళ్తే మీకు.. ఐదేళ్లలో మొత్తం రూ. 300,000 అవుతుంది. దీనికి 6.70 శాతం చొప్పున, మీకు రూ. 56,830 వడ్డీ లభిస్తుంది. మెచ్యూరిటీ మొత్తం రూ. 3,56,830 అవుతుంది. ఒకవేళ మీరు ఐదేళ్లలో రూ. 10 లక్షలు జమ చేయాలనుకుంటే నెలకు రూ. 15000 డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే మీరు ఐదేళ్లలో మొత్తం రూ. 900,000 పెట్టుబడి పెడతారు. మీకు వడ్డీ రూ. 1,70,492 లభిస్తుంది. దీంతో మెచ్యూరిటీ మొత్తం రూ. 10,70,492 అవుతుంది.

Tags:    

Similar News